ఓ ప్రయోగత్మక చిత్రంలో నటించబోతున్న బ్యూటీ

Share

గత టూ త్రీ ఇయర్స్ టాలీవుడ్‌లో రకుల్ నామ సంవత్సరంగా మారుమోగిపోయింది. పోయిన 2017లో ఏడపెడ సినిమా చేసిన రకుల్ 2018లో మాత్రం తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్, కోలీవుడ్ పై కాన్సట్రెషన్ చేసిన ఈ పంజాబి బ్యూటీ టాలీవుడ్ మళ్లీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలిని చూస్తుంది. డిఫరెంట్ స్టోరీస్‌తో హిందీ, తమిళ బాషల్లో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్న రకుల్ తెలుగులో అదే ఫార్ములాను ఫాలో అవ్వాలని చూస్తుంది. తాజాగా తెలుగులో ఓ ప్రయోగాత్మక మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

డిఫరెంట్ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో యంగ్ హీరో నితిన్‌తో ప్రయోగాత్మక కథాంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తు సినిమాని తెరకెక్కించబోతున్నాడని టాలీవుడ్ సర్కీల్‌లో టాక్ వినిపిస్తోంది.ఈ కథ హీరోయిన్ చుట్టు తిరుగుతుందట. ఇందులో హీరోయిన్ పాత్ర రోటీన్‌గా డీ గ్లామర్‌ పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రకు రకుల్‌ప్రీత్‌సింగ్ సూట్ అవుతుందని భావించిన దర్శకుడు ఆమెకు ఇటివలే కథని నారెట్ చేశాడట. కథతో పాటు క్యారెక్టరైజేషన్ కూడా నచ్చడంతో రకుల్ వెంటనే ఒకే చెప్పిందట.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపోందనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఈ మూవీతో మళ్లీ టాలీవుడ్‌లో తన జోరు చూపించాలకుంటుందట రకుల్. ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఎన్‌జీకే, కార్తీతో దేవ్‌ మూవీతో పాటు హిందీలో రెండు చిత్రాలు చేస్తుంది. మరి డీ గ్లామర్ పాత్రతో రకుల్ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.


Share

Related posts

కంగ‌నా మ‌రో అవ‌తారం

Siva Prasad

Vaddura Sodharaa: ఇంట్రెస్టింగ్ గా “వద్దురా సోదరా” ఫస్ట్ లుక్ – మోషన్ పోస్టర్..!!

bharani jella

రాధే శ్యామ్ బ్యానర్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ .. దర్శకుడు, హీరో ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే ..?

GRK

Leave a Comment