Animal: కొత్త పెళ్లి కొడుకు రణ్‌బీర్ కపూర్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా `యానిమల్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హిందీ మూవీని `అర్జున్ రెడ్డి`తో సూపర్ పాపులర్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇందులో కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా శుక్రవారం ఉదయం మనాలీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. అదే రోజు హిమాలయాల్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టారు. అయితే ఇంతలోనే యానిమల్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలేం జరిగిందంటే.. షూట్ మొదలైన తొలి రోజే రణ్‌బీర్, రష్మికల ఫస్ట్ లుక్స్ ఫొటోలు, వీడియోల రూపంలో లీక్ అయ్యాయి. వీటిలో రణ్‌బీర్ వైట్ కుర్తాలో కనిపించగా, రష్మిక వైట్ అండ్ రెడ్ చీరలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి తొలి రోజే లీకులు వీరులు షాక్ ఇవ్వడంతో.. ముందు ముందు చిత్ర టీమ్ ఖఠినమైన జాగ్రత్తలను తీసుకుంటుందని భావిస్తున్నారు. కాగా, హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. ఇందులో రష్మిక గీతాంజలి అనే పాత్రలో కనిపించబోతోంది.
Video: Ranbir Kapoor & Rashmika Mandanna spotted in Manali today. 👀🤍#Animal #SandeepReddyVanga pic.twitter.com/5uu5DMIkMz
— Ranbir Kapoor Universe (@RanbirKUniverse) April 23, 2022