RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. కెరియర్ లో 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరాకెక్కుతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ మూవీ. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరాకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్. సునీల్, ఎస్ జె సూర్య… ఇంకా పలువురు తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కీలకపాత్రలు పోషించడం జరిగింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రైట్స్ ఇప్పుడు అరాచకం సృష్టిస్తుంది.
చరణ్ కెరియర్ లోనే అత్యంత ఎక్కువ ధర పలికినట్లు ఓ వార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రీసెంట్ గా అమెరికా మరియు కెనడా దేశాలకు సంబంధించి 17 కోట్ల రూపాయలు పలికిందట. ఇది చరణ్ కెరియర్ లోనే అత్యంత హై రేటు అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే “RRR” విజయంతో చరణ్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పాకటంతో.. “RC 15” ధర ఈ రీతిగా పలికిందని అంటున్నారు. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని టాక్. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ జానీ మాస్టర్ ఆధ్వర్యంలో చరణ్ వేసిన స్టెప్పులు సినిమాకి హైలెట్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి ఓ అప్ డేట్ రానున్నట్లు సమాచారం. డైరెక్టర్ శంకర్ యధావిధిగా తన స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమా చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రాజమహేంద్రవరంలో షూటింగ్ జరుపుకుంటుంది.