Asian Film Award’s Academy: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. RRR, బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ 1, కేజిఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి. రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దక్షిణాది సినిమాలకు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ ప్రముఖుల సైతం దక్షిణాది టాలెంట్ నమ్ముకుని సినిమాలు నిర్మించడానికి.. చేయటానికి ముందుకు వస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది రిలీజ్ అయిన RRR, పొన్నియిన్ సెల్వన్ మూవీస్ రెండు కూడా ఏషియన్ ఫిలిం అవార్డ్స్ నామినేషన్ లో సత్తా చాటాయి.

పొన్నియిన్ సెల్వన్ ఆరు నామినేషన్లలో..RRR పలు విభాగాలలో నామినేట్ అయ్యాయి. హాంకాంగ్ లో మార్చి 12వ తారీకు జరగనున్న 16వ ఏషియన్ ఫిలిం అవార్డ్స్ కు సంబంధించిన నామినేషన్ లు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన “పొన్నియిన్ సెల్వన్” ఉత్తమ చిత్రంతో సహా ఆరు విభాగాల్లో నామినేట్ అయింది. ఇక RRR విషయానికొస్తే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేట్ అయ్యింది. RRR ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఆస్కార్ షార్ట్ లిస్టులో “నాటు నాటు సాంగ్” సెలెక్ట్ కావడం జరిగింది.

ఈ క్రమంలో ఈ రెండు సినిమాలు ఏషియన్ అంతర్జాతీయ ఫిలిం అవార్డ్స్ కి నామినేట్ కావటం సంచలనంగా మారింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1… దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం జరిగింది. “RRR” ఇండియాలో వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటం విశేషం. పొన్నియిన్ సెల్వన్ ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా రవి వర్మన్.. బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ గా ఏఆర్ రెహమాన్ ఉత్తమ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ తోట ధరణి.. ఉత్తమ సంగీత ఏక లఖానీ ఎంపిక కావడం జరిగింది.