29.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు..ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారంటూ

Share

టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వంపై, సీఎం జగన్మోహనరెడ్డిపై, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుప్పంలో వ్యవహరించిన తీరుపై సజ్జల మండిపడ్డారు. ప్రజలకు ఇబ్బంది కల్గించేలా రోడ్లపై సభలు నిర్వహించడం సరికాదని అన్నారు.

Sajjala Rama Krishna Reddy Slams Chandrababu

మొన్న గుజరాత్ లో .. నేడు తెలంగాణలో .. డ్రైవింగ్ సీటులోనే గుండెపోటుతో డ్రైవర్ లు మృతి .. అధికారులు దృష్టిసారించాల్సిందే..

ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అందుకే ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వర్తిస్తుందన్నారు. పోలీస్ యాక్ట్ కు లోబడి ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని చెప్పారు. జరిగిన మారణకాండకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చంద్రబాబు ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు నిబంధనలు పాటించి ఉంచే అమాయకులు చనిపోయే వారు కాదని అన్నారు.

చంద్రబాబు చట్టాలను పట్టించుకోను, ఏమి చేస్తారో చేసుకోమని అంటున్నారనీ సజ్జల విమర్శించారు. ఆయన సభలను పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదనీ, నిబంధనలు పాటించాలని మాత్రమే పోలీసులు తెలిపారన్నారు. చంద్రబాబుకు కనీస సంస్కారం కూడా లేదనీ, ఉన్మాదిగా ప్రవర్తిస్తున్నారంటూ దుయ్యబట్టారు. మరో పక్క ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 ను ఉప సంహరించుకోవాలని చంద్రబాబుతో సహా పలు రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తుండగా, ఆ జోవోను ఉప సంహరించే ప్రసక్తేదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

లెక్కలు చెప్పి మరీ కేంద్రంలోని బీజేపీని దూర్పారబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్


Share

Related posts

మేనల్లుడు హరీష్ ను వదులుకోలేక, ప్రాణ స్నేహితుడు జగన్ ని వదులుకోలేక తలపట్టుకున్న కేసీఆర్…!!

sekhar

Chandrababu: జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన చంద్రబాబు

somaraju sharma

Corona: దేవుడా ర‌క్షించు నా దేశాన్ని … క‌రోనా థర్డ్ వేవ్ ఎంట్రీ!

sridhar