Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి అందరికీ సుపరిచితురాలే. “ప్రేమం” సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సాయి పల్లవి దక్షిణాది సినిమా రంగంలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా డాన్స్ లో… సాయి పల్లవి వేసే రిథమ్ స్టెప్ లకి ..సరి సమానంగా మ్యాచ్ చేసే హీరోయిన్ మరొకరు లేరని చెప్పవచ్చు. ఇదే సమయంలో సాయిపల్లవి నటించిన సినిమాలలో డాన్స్ పరంగా ఆమెతో పక్కన హీరో కూడా అనేక కష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక డాన్స్ పరంగా మాత్రమే కాదు నటన పరంగా అన్నిరకాలుగా సాయిపల్లవి తనదైన శైలిలో స్క్రీన్ మీద దూసుకుపోయే హీరోయిన్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న సాయి పల్లవి.. తాజాగా తన కొత్త సినిమా “విరాటపర్వం” ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతోంది. జూన్ 17 వ తారీకు “విరాటపర్వం” ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్ ప్రొడక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో ప్రియమణి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో సాయిపల్లవి ఒక పక్క తన గురించి ఇంకా అనేక విషయాల గురించి తెలియజేస్తూ ఉంది. దీనిలో భాగంగా తన డ్రస్ సెన్స్ గురించి సాయిపల్లవి మాట్లాడుతూ… ఓ సంఘటన వల్ల పొట్టి దుస్తులు వేసుకోకూడదు అని డిసైడ్ అయినట్లు తేల్చిచెప్పింది.
మేటర్ లోకి వెళ్తే మెడిసిన్ చదువు కోసం జార్జియా వెళ్ళిన సమయంలో…టాంగో డాన్స్ నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ డాన్స్ కోసం కంఫర్ట్ గా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. దీంతో ఇంటిలో ఉన్న అమ్మ వాళ్ళ పర్మిషన్ తీసుకుని.. ఆ పొట్టి దుస్తుల కాస్ట్యూమ్ ధరించటం జరిగింది. అయితే ప్రేమమ్ సినిమా తర్వాత..టాంగో డాన్స్ వీడియో బయటపడింది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో ఆ వీడియో కింద కామెంట్ చూసి.. పొట్టి దుస్తులకు అప్పటినుండి నో చెప్పాను అని… సాయి పల్లవి వైరల్ కామెంట్ చేయడం జరిగింది. సినిమాల్లో చాలా వరకు సాయి పల్లవి చాలా ఒద్దికగా దుస్తులు ధరిస్తూ ఉంటది. ఎక్కడ ఏ మాత్రం… ఎక్స్పోజింగ్ దుస్తులు వేసుకున్న సందర్భాలు కూడా ఉండవు. సాయి పల్లవి లో ఉండే ఈ అలవాటును చాలామంది లైక్ చేస్తూ ఉంటారు.