Samantha: అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం సామ్ డీలా పడిపోతుందని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలదన్నుతూ సామ్ ప్రస్తుతం తన జీవితంలో దూసుకుపోతుందనే చెప్పుకోవాలి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, పలు వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక ఇటీవల రిలీజైన ‘పుష్ప’ సినిమాలో సామ్ చేసిన ఐటెం సాంగ్ కి తెలుగు రాష్ట్రాలు నర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఓ టీమిండియా క్రికెటర్‌తో సమంత స్క్రీన్ షేర్ చేసుకుంటుందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/02/IMG-20220211-WA0075-e1644573585126.jpg" alt="" width="800" height="471" class="alignnone size-full wp-image-233580" /
-
OTT: అత్యంత ఛీప్ OTT సబ్స్క్రిప్షన్ యాప్ గురించి తెలుసా? కేవలం రూ.149కే 15 OTTల వీడియో కంటెంట్ చూడొచ్చు!
Samantha: ఇంతకీ ఎవరా ఇండియన్ క్రికెటర్?
ఇక అసలు విషయంలోకి వెళితే, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’. నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దీనికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్స్ అదిరిపోయాయి. ఇక ఈ సినిమాలో ఒకప్పటి టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కూడా నటిస్తున్నాడని తెలుపుతూ ఆయన లుక్ తాజాగా రివీల్ చేసింది చిత్ర యూనిట్.
AP Capital: విద్యాశాఖలోనూ కన్ఫ్యూజన్.. ఏపికి రాజధాని పేరు లేకుండానే భారతదేశ పటం..
శ్రీశాంత్ రోల్ ఏమిటి?
గతంలో కూడా శ్రీశాంత్ ఓ సినిమాలో నటించడం మనం చూశాం. ఇపుడు తాజాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రంలో శ్రీశాంత్ రోల్ చాలా కీలకం అని సమాచారం. అలాగే సమంతతో కొన్ని కీలక సన్నివేశాల్లో శ్రీశాంత్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు “అతను సామ్ కి లైఫ్ ఇస్తాడా? సామ్ అతనికి లైఫ్ ఇస్తుందా?” అని సరదా సరదా ఎమోజిలు షేర్ చేస్తున్నారు.