హీరోయిన్ సమంత దక్షిణాది సినిమా రంగంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మరింతగా కెరియర్ పరంగా సమంత దూసుకుపోతుంది. టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలో నాగచైతన్యతో పెళ్లయ్యాక కూడా కెరియర్ కొనసాగిస్తూ అప్పట్లో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే సమంత చేయడం జరిగింది.
నాగచైతన్య, సమంత మధ్య భారీ వార్.. కొద్దిలో మిస్ అయిందిగా..
కానీ ఎప్పుడైతే చైతూతో విడాకులు తీసుకోవడం జరిగిందో… అప్పటినుండి ఒకపక్క వెబ్ సిరీస్, మరోపక్క సినిమాలు ఇంకా ఐటెం సాంగ్ లు చేస్తూ రాణిస్తుంది. ఈ క్రమంలో డైరెక్టర్ హరి హరీష్ దర్శకత్వంలో “యశోద” అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడం తెలిసిందే. అయితే ఈ సినిమాలో సమంత సాహసోపేతంగా కొన్ని సన్నివేశాలలో నటించడం జరిగిందట. సినిమాలో ఎక్కువ యాక్షన్ భాగం సన్నివేశాలు ఉండటంతో చాలాసార్లు రోప్ కూడా కట్టుకోకుండా ఒరిజినల్ గా చేసిందట. ఆ టైంలో డుప్ వాడదామని సమంతతో చర్చించిన గాని ఆమె ఒప్పుకోలేదు అని సినిమా దర్శకుడు తెలియజేశారు. యశోద యాక్షన్స్ సన్నివేశాలలో ఎవరి సాయం లేకుండా సమంత అదరగొట్టే స్టెంట్స్ చేసింది. కొన్నిసార్లు రక్షణగా ఉపయోగించాల్సిన తాడులు కూడా.. వాడలేదట. యాక్షన్ సన్నివేశాలలో యశోదలో సమంత మరో రకంగా నటించిందని డైరెక్టర్ హరి హరీష్.. సరికొత్త వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 12వ తారీకు సినిమా రిలీజ్ అవుతున్నట్లు పేర్కొన్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సమంత కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుంది. తెలుగు మరియు తమిళంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా హిందీ ఇంకా మలయాళం, కన్నడలో డబ్ వర్షన్ లో విడుదల కానుంది. ఇటీవల సినిమాకి సంబంధించి విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ తదితర నటులు కీలకపాత్రలు పోషిస్తున్నరు. రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో సినిమా యూనిట్ సినిమా ప్రచార కార్యక్రమాలలో స్పీడ్ పెంచుతూ ఉంది.