RRR: ఇది ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకి మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికే మూడు ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డు కూడా గెలిచే అవకాశాలు ఉన్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయితోపాటు రాజమౌళి స్థాయిని కూడా పెంచేసింది. ఈ సినిమాకి చాలామంది విదేశీయులు బాగా కనెక్ట్ అయ్యారు. నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాగా అధిక స్థాయిలో స్ట్రీమింగ్ అయిన మూవీగా రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా “RRR” ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో దర్శకుడిగా రాజమౌళిక అనేక అంతర్జాతీయ సినిమా వేడుకలకు ఆహ్వానాలు అందాయి. అయితే ఆ సమయంలో చాలామంది మీడియా ప్రతినిధులు “RRR” సీక్వెల్ గురించి అనేకమైన ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ క్రమంలో సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ తాజాగా సీక్వెల్ పై కసరత్తులు జరుగుతున్న తరుణంలో వారం క్రితం ఒక స్టోరీ లాక్ అయ్యింది. అది చాలా గొప్ప ఆలోచన. ప్రస్తుతం దాని అమలు చేసే తరహాలో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. అది విజయవంతంగా పూర్తి అయితే అప్పుడు సీక్వెల్ గురించి మాట్లాడతాను అని జక్కన్న తెలియజేశాడు.
తాజా వార్తతో మెగా మరియు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్టు “RRR” సీక్వెల్ వస్తే ప్రపంచవ్యాప్తంగా.. అనేక భాషలలో విడుదల చేస్తే మొదటివారానికే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయిపోతాయని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ వచ్చే ఏడాది ప్రారంభానికి కంప్లీట్ కానుందట. వచ్చే ఏడాది స్టార్టింగ్ లోనే ఈ సినిమా ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన చేసి కృష్ణ బర్తడే మే 31వ తారీకు నాడు సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో… మహేష్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే మహేష్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మాత్రం రాజమౌళి “RRR” సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.