KGF 2: “ఆర్ఆర్ఆర్” మూవీ పేరు దేశవ్యాప్తంగా నిన్నటి వరకు వినపడింది. కాగా ఇప్పుడు “కేజిఎఫ్ 2″ సినిమా పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఏప్రిల్ 14 వ తారీకు”కేజిఎఫ్ 2” విడుదల అవుతున్న నేపథ్యంలో… ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో నిన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్..తో పాటు హీరో యాష్ మరికొంతమంది సినిమా టెక్నీషియన్లు పర్యటించారు. కచ్చితంగా సినిమా అంచనాలకు తగ్గ రీతిగానే ఉంటుందని.. గ్యారెంటీ బ్లాక్ బస్టర్ అవుతుందని హీరో యాష్ ధీమా వ్యక్తం చేయడం జరిగింది.
మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో…”కేజిఎఫ్ 2″ కూడా .. అదే స్థాయిలో విజయం సాధిస్తుందని సినిమా యూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్… మొదటి నుండి సినిమా లవర్ అని అందరికీ తెలుసు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు చూస్తారు అని కూడా తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే సినిమా చూడటం మాత్రమే కాదు కొత్త యంగ్ టాలెంట్ నీ కూడా వాడుకోవటంలో తన మార్క్ “కేజిఎఫ్ 2” లో చూపించడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాకి ఒక 19 సంవత్సరాల కుర్రాడిని ఎడిటర్ గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఉజ్వల్ కులకర్ణి అనే 19 సంవత్సరాల కుర్రాడు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు. అతని పనితనం నచ్చి ఎడిటర్ గా “కేజిఎఫ్” కి తీసుకోవటం జరిగింది టీజర్ మరియు ట్రైలర్ అదేవిధంగా సాంగ్స్ అంత బాగా రావడానికి కారణం ఈ 19 సంవత్సరాల కుర్రవాడే అని ప్రశాంత్ నీల్ చెప్పుకు రావడం జరిగింది.