దాదాపు 12 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలోవినపడుతున్న, చేయాలనుకుంటున్న సినిమాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఒకటి. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను రూపొందడానికి గల కారణాన్ని మెగాస్టార్ చిరంజీవి చెబుతూ “సైరా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందు వస్తుందంటే కారణం `బాహుబలి` సినిమాయే. నాపై 30 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే రోజుల్లో ఉయ్యాలవాడ కోసం 75 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని తెలుసుకుని ప్రయత్నం మానుకున్నాం. అయితే ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ సినిమా చేయడానికి కారణం మాత్రం రాజమౌళిగారి బాహుబలి సినిమానే. ఆయన మా అందరికీ మార్గనిర్దేశం చేశారు. ఎవరో నిర్మాతలు ఖర్చు పెట్టి ఇంత భారీగా సినిమా చేయడం ఎందుకు? వారికి రిస్క్ వద్దు. ఆ రిస్క్ ఏదో మనమే పడదామని చరణ్ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. నేను కూడా సై అన్నాను“ అన్నారు.
previous post
next post