బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్యయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 15న కర్నూలులో నిర్వహించడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ప్రాంతానికి చెందినవాడు కావడంతో ప్రీ రిలీజ్‌ను కర్నూలులో నిర్వహించాలనుకుంటున్నారట.