Vakeel Saab : దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తున్న క్రమములో “వకీల్ సాబ్” సినిమా రిలీజ్ తరుణంలో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరగటంతో .. చాలా మంది ప్రముఖులు మాట్లాడి సినిమా కచ్చితంగా హిట్టవుతుందని కామెంట్లు చేయటంతో.. ఏప్రిల్ 9 వ తారీకు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మొట్ట మొదటి సారి పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో .. ఎటువంటి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల రిలీజైన సినిమా ట్రైలర్ కూడా అదరగొట్టే రీతిలో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా వంటి దేశాలలో భారీ ఎత్తున సినిమా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి. కాగా ఈ రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా “వకీల్ సాబ్” అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావటంతో టికెట్లు నిమిషాలలోనే క్లోజ్ అయిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూడటం కోసం అభిమానులు భారీ ఎత్తున సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
దాదాపు మూడు సంవత్సరాలు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం .. గ్యాప్ ఇచ్చి సినిమా చేయడంతో .. “వకీల్ సాబ్” రిలీజ్ కోసం మెగా అభిమానులు భారీ ఎత్తున సందడి చేస్తూ ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. పవన్ సరసన హీరోయిన్ పాత్రలో శృతిహాసన్ నటించడం జరిగింది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సమాజంలో స్త్రీ ఎదుర్కోబోయే సమస్యల తరహాలో బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ గా “వకీల్ సాబ్” తెరకెక్కింది.