RRR: “ఆర్ఆర్ఆర్” ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలైన ప్రతి చోట విజయం సాధించిన “ఆర్ఆర్ఆర్”… రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుదలైన 10 రోజులకే 800 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా.. ప్రపంచ సినిమా రంగానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దమ్మేంటో నిరూపించింది. ఇదిలా ఉంటే “ఆర్ఆర్ఆర్” రిలీజ్ అయిన తర్వాత సినిమాకి సంబంధించి సోషల్ మీడియా చానల్స్ కి స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అనేక ఇంటర్వ్యూల్లో ఇస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా ఇంటర్వ్యూలలో “ఆర్ఆర్ఆర్” సీక్వెల్ చేయటానికి చాలా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్ నిర్మాత దిల్ రాజు ఏర్పాటుచేసిన “ఆర్ఆర్ఆర్” గ్రాండ్ పార్టీలో కూడా విజయేంద్రప్రసాద్ చెప్పినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టిక్ టాక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
“ఆర్ఆర్ఆర్” నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు.. హక్కులు సొంతం చేసుకోవడంతో సినిమా బిగ్ సక్సెస్ సాధించడంతో…”ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ మొత్తానికి ఏప్రిల్ నాలుగోవ తారీకు సోమవారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు డైరెక్టర్ రాజమౌళి తో పాటు ఇద్దరు హీరోలు కుటుంబసమేతంగా హాజరు కావడం విశేషం. అంతమాత్రమే కాదు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు.
ఇంతమంది సెలబ్రిటీల ముందు స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్…”ఆర్ఆర్ఆర్” సీక్వెల్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని… కామెంట్ చేసినట్లు.. అందుకు తగ్గ ఐడియాలు కూడా రెడీగా ఉన్నాయి అని చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్. రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాం ఏరియాలో “ఆర్ఆర్ఆర్” రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. తెలుగు మార్కెట్ కి నైజాం వెన్నెముక లాంటిది. అటువంటి ఈ ప్రాంతంలో బాహుబలి ఇంకా చాలా సినిమా రికార్డులు “ఆర్ఆర్ఆర్” బ్రేక్ చేయడం జరిగింది. సరికొత్త లెక్కలు ఇప్పుడు సెట్ చేసే పనుల్లో “ఆర్ఆర్ఆర్” కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఓవరాల్ రన్ టైంకి వచ్చే సరికి “ఆర్ఆర్ఆర్” అత్తిపెద్ద నెంబర్ పెట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.