AP Fiber Grid Scam: నారా వారబ్బాయి దొరికినట్టేనా..!? లోకేష్ పాత్ర 300 కోట్లు..! సీఐడీ దృష్టి ఆ టెండర్ పైనే..!?

AP Fiber Grid Scam: AP CID Finding Lokesh Deal 300 crores
Share

AP Fiber Grid Scam: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసే ప్రయత్నాల్లో ఉంది. అందుకు బాధ్యులైన వారిని జైలులో వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరం ప్రాజెక్టు టెండర్, ఫైబర్ నెట్ తదితర విషయాల్లో అవినీతి, అక్రమాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తూనే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన కొన్ని కుంభకోణాలను ఆధార సహితంగా బయటపెట్టి చంద్రబాబు పాత్ర ఇదీ, లోకేష్ పాత్ర ఇదీ, నాటి మంత్రుల పాత్ర ఇదీ అని నిరూపించే వేటను ఆరంభించింది. కానీ ఏ ఒక్కటీ చట్ట, న్యాయ బద్ధంగా నిరూపితం కావడం లేదు. అవినీతి జరిగినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, కళ్ళెదురుగా అనిపిస్తుంది.. కానీ చట్టం, న్యాయం ముందు నిలవడం లేదు. ఒక్క అచ్చెన్నాయుడుపై మినహా ఎవరిపైనా కేసులు పెట్టలేదు, అరెస్టు చేయలేదు. అయితే మాజీ మంత్రులను అరెస్టు చేస్తే జగన్ కుషీ అవుతారని ఈ రెండున్నరేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేశారు. కొల్లు రవీంద్రను వేరే కేసులో అరెస్టు చేశారు. దేవినేని ఉమా, చింతమనేని ప్రభాకర్ తదితరులను వేరువేరు కేసుల్లో అరెస్టు చేశారు. ఇప్పుడు లోకేష్ అవినీతి తంతుపై లోతుగా దర్యాప్తు జరుగుతుంది..! ఇప్పటికే 19 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

AP Fiber Grid Scam: AP CID Finding Lokesh Deal
AP Fiber Grid Scam: AP CID Finding Lokesh Deal

AP Fiber Grid Scam: అమరావతి కేసులా కాకుండా.. మరింత లోతుగా..!!

ఏపి ఫైబర్ నెట్ కుంభకోణాన్నివెతికి తీసి నారా లోకేష్ ను అరెస్టు చేయాలనేది ఒక ప్రణాళిక. నారా లోకేష్ పై మొదటి నుండి తన పై చిన్న చిన్న కేసులు ఉన్నాయి కానీ జగన్మోహనరెడ్డి మీద లాగా భారీ అవినీతి కేసులు, కుంభకోణాల కేసులు లేవు, తాను అవినీతి పరుడిని కాను అంటూ పదేపదే చెప్పుకొస్తున్నారు.  కానీ నారా లోకేష్ నిర్వహించింది ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు. ఆ శాఖ పరిధిలోని ఏపి ఫైబర్ నెట్ చాలా అవినీతి జరిగిందని వైసీపీకి తెలుసు. దాన్ని నిరూపించాలని అనుకుంటోంది. ఆ క్రమంలోనే ఏపి ఫైబర్ నెట్ లో రూ.1500 కోట్ల కుంభకోణం జరిగిందని తాజాగా కేసు నమోదు చేసింది. ఏపి సీఐడీ విచారణ కూడా మొదలు పెట్టింది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఇది సింపుల గా ముగియ కూడదు. పక్కాగా అవినీతిని నిరూపించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు వీగిపోయింది. అయితే ఇప్పుడు ఏపి ఫైబర్ నెట్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది…? సీఐడీ ఏ విధంగా ఆధారాలు సేకరిస్తుంది..? అనేది కీలకంగా మారింది. ప్రస్తుతం ఏపి ఫైబర్ నెట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న గౌతమ్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ దాని మీద కేసు నమోదు చేసింది. అప్పట్లో సైబర్ నెట్ కు సీఈఓగా ఉన్న హరిప్రసాద్ సహా అప్పుడు పని చేసిన ఓ ఐఏఎస్ అధికారి, నాడు శాఖను చూసిన మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ అవినీతిలో పాత్రదారులనేది వైసీపీ ఆరోపణ.

AP Fiber Grid Scam: AP CID Finding Lokesh Deal 300 crores
AP Fiber Grid Scam: AP CID Finding Lokesh Deal 300 crores

లోకేష్ పాత్ర ఆ 300 కోట్లపై..!!

అయితే ఇప్పుడు ఈ కేసు ఉచ్చు నారా లోకేష్ చుట్టూ బిగుసుకుంటుందా లేదా అన్నదే కీలకమైన విషయం. 2015లో ప్రారంభించిన ఈ ఫైబర్ నెట్ లో కాంట్రాక్ట్ పనులను అప్పటికే బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు అప్పగించారనీ, దీనికి సుమారు 300 కోట్లు చేతులు మారాయి అనేది ప్రభుత్వ ఆరోపణ. గతంలో వైసీపీ ఇదే ఆరోపణలు చేసింది ఇప్పుడు ప్రభుత్వం ఇదే ఆరోపణ చేస్తోంది. ఈ ఆరోపణలను నిరూపించాలంటే ఆధారాలు చూపించాలి. చట్టబద్దంగా, న్యాయబద్దంగా నిరూపించి అందుకు బాధ్యులైన వారికి శిక్షలు పడేలా చేయాలి. అప్పుడే వైసీపీ చేసిన ఆరోపణలను సామాన్య ప్రజలు, ఉద్యోగులు ఇతర వర్గాలు నమ్మే పరిస్థితి ఉంటుంది. నారా లోకేష్ పై ప్రభుత్వం చేస్తుంది ప్రస్తుతం ఆరోపణులు మాత్రమే. అధారాలు లేవు, సాక్షాలు లేవు. నిరూపించలేదు. తాజాగా ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది కాబట్టి ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. సీఐడీ దర్యాప్తులో అక్రమాలు బట్టబయలయ్యాయి. గత ప్రభుత్వం టెరా సాఫ్ట్‌కు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టింది. రూ.330 కోట్ల తొలిదశ ఆఫ్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్లలో అవినీతి జరిగింది. వేమూరి, టెరాసాఫ్ట్‌ సహా అప్పటి అధికారులపై కేసు నమోదైంది. సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అంచనా. బ్లాక్‌ లిస్టులోని కంపెనీకి గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫోర్జరీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌తో మోసం చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దీనిలో రూ. 300 కోట్ల విషయంలో నారా లోకేష్ దొరికినట్టు సీఐడీ వర్గాలు పేర్కొంటున్నాయి..!


Share

Related posts

బీజేపీ ప్లాన్స్ అదరహో..! ప్రాంతీయ పార్టీల గతేమికానూ..??

somaraju sharma

టీడీపీ “నాడు – నేడు”

Srinivas Manem

ఇది రఘురామకృష్ణంరాజు దెబ్బ..! ఓ పెద్ద అవినీతి బండారాన్ని బయట పెట్టబోతున్నారు..!!

somaraju sharma