NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

Political Survey: “సర్వేం”తర్యామి… వింటున్న వారికా – చెప్తున్న వారికా..? ఎవరికి బుద్ధి లేనట్టు..!? అసలు కథ ఇదీ..!!

Political Survey: Internal Facts in Survey Results

Political Survey:  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ 60 ఎమ్మెల్యే స్థానాలు కోల్పోతుంది – రెండు వారాల వైరల్ వచ్చిన ఒక సర్వే సారాంశం ఇది..!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో జగన్ 5 శాతం ఓట్లు కోల్పోనున్నారు – రెండు రోజులుగా లోకల్ యాప్ సర్వే అంటూ వస్తున్నా వార్త ఇదీ..!
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 11 మంది సిటింగ్ మంత్రులు ఓడిపోనున్నారు – లోకల్ యాప్ అని చెప్తున్న సర్వే సారాంశం ఇది..!
జగన్ కంటే ఎంపీ రఘురామకృష్ణంరాజుకి 19 శాతం ఎక్కువ ప్రజాదరణ ఉంది – తాజాగా ఈరోజు రఘురామ బయటపెట్టిన సర్వే ఇదీ..!

వాయమ్మో… ఏపీ మొత్తం జగన్ కి వ్యతిరేకమేనట.. జగన్ ఓడిపోతారట..? మరి ఈ లచ్చల కోట్ల సంక్షేమ పథకాలు ఏమైనట్టు..? సరే కాసేపు నమ్మేద్దాం..! నమ్ముతూనే కాసేపు ఈ పార్టీలను, నాయకులను, ప్రాంతాలను పక్కన పెట్టి ఈ సర్వేల ఉద్దేశాలు, అంతర్గత వాస్తవాలు కాసేపు మాట్లాడుకుందాం..!

Political Survey: Internal Facts in Survey Results
Political Survey Internal Facts in Survey Results

Political Survey: ఈ కఠోర వాస్తవం మర్చిపోకూడదు..!

జగన్ పై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కావచ్చు. జగన్ పరిపాలన తీరు కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు. ఉద్యోగ, నిరుద్యగ, విద్యావంతులు, ఉపాధ్యాయుల్లో జగన్ పరిపాలన పట్ల కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట వాస్తవమే కావచ్చు. కానీ మాస్ ఓటింగ్ లో జగన్ ఇప్పటికే 2019 నాటి జగనే… పల్లెల, పేదల ఓటింగ్ లో జగన్ ఇప్పటికీ 2019 నాటి జగనే.. ముఖ్యంగా గ్రామీణ మహిళా ఓటింగ్ లో ఇప్పటికీ జగన్ 2019 నాటి జగనే.. ఆ విషయాలు అంగీకరించాలి. అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే జగన్ కాస్త బలహీనపడవచ్చు. అన్ని వర్గాలను సంతృప్తి పరచడం రెండేళ్లలో సాధ్యం కాదు. అందుకే కొన్ని వర్గాలు జగన్ కి దూరమవుతున్నాయి. కానీ దూరమైనా వర్గాలను దగ్గర చేసుకోవడమూ పెద్ద కష్టం కాదు. అంచేత జగన్ కి వాస్తవంగా వ్యతిరేకత ఉన్న ఉద్యోగ, నిరుద్యగ, విద్యావంతులు, ఉపాధ్యాయ, పట్టన యువ ఓటర్లను ఆకట్టుకునే ఒకటో, రెండో బాణాలు జగన్ దగ్గర లేకపోలేవు. అవన్నీ వచ్చే ఏడాది బయటకు తీసే అవకాశాలు లేకపోలేదు. సో… వ్యతిరేకత నిజమైన వ్యతిరేకత కాదు, రాజకీయంగా జగన్ ని ఇబ్బంది పెట్టె వ్యతిరేకత కాదు.. ఈ ఓట్లేమీ చంద్రబాబుకి గంపగుత్తగా పడిపోయే సీన్ లేదు..!

Political Survey: Internal Facts in Survey Results
Political Survey Internal Facts in Survey Results

సర్వేల్లో లెక్కలు బోలెడున్నాయి..!?

సర్వే అంటే ఇప్పుడు చీప్ అయిపొయింది. ఆ మహత్తర భాగ్యం మూటగట్టుకున్నది “లగడపాటి రాజగోపాల్” గారే.., ఆపై ఇప్పుడు పెరుగుతున్న సోషల్ మీడియా విభగాలు, డిజిటల్ మీడియా సంస్థలు కూడా..! సర్వే అన్నా.., రాజకీయ ప్రజానాడి అన్నా ఒకప్పుడు మాంచి ఉత్సుకత, ఆసక్తి ఉండేది. కానీ గడిచిన అయిదేళ్లుగా డిజిటల్ మీడియా సంస్థలు దాన్ని నీరుగార్చాయి. మూడేళ్ళ కిందట దాన్ని లగడపాటి రాజగోపాల్ పూర్తిగా సర్వేలపై నమ్మకం లేకుండా చేశారు.
* సర్వేలంటే ఆషామాషీ కాదు. బోలెడన్ని లెక్కలున్నాయి. నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్ల అభిప్రాయాలు తీసుకున్నారు..!? ఏ ఏ వర్గాల అభిప్రాయాలూ తీసుకున్నారు..!? ఏ సామాజికవర్గ అభిప్రాయాలు తీసుకున్నారు..!? ఏ ప్రాంతంలో ఎన్ని నమూనాలు తీసుకున్నారు..? ఏ సమయంలో తీసుకున్నారు..? అనేది కూడా కీలకమే.
* పైన మనం చెప్పుకున్నట్టు వర్గాల వారీగా వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ సర్వేలు పని చేయవు. ఒక నియోజకవర్గంలో కనీసం 6 నుండి 8 శాతం నమూనాలు తీసుకోవాలి. దీనిలోనూ ఎస్సి, బీసీ, ఓసీ, యువత, ముసలి అన్ని వర్గాల, వయసుల అభిప్రాయాలు తీసుకోవాలి. అన్నిటికీ మించి అడిగిన ప్రశ్నల్లో కూడా సర్వే ఫలితం తారుమారవుతుంది.
* ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా పోటీలో లోతుగా.. నిజంగా ప్రజాభిప్రాయాన్ని పసిగట్టగలిగే సర్వేలు చేసేంత సీన్ ఎవ్వరిలో లేదు. లోకల్ యాప్, ఇండియా టుడే కూడా కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా చేసినవే. నేరుగా కలిసి ప్రశ్నలు అడిగి, ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నవి అయితే కాదు. అంచేత దీనిలో నమ్మదగిన అంశాలు లేవు..! టీడీపీ భుజాలు ఎగరేసుకోవద్దు. వైసీపీ బెంగ పెట్టుకోవద్దు. కానీ జగన్ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. కొన్ని వర్గాల్లో వ్యతిరేకతని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయాల్సిందే.. లేకపోతే ఈ సర్వేలకు మించిన నష్టం ఎదుర్కోకతప్పకపోవచ్చు..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju