NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఉతికి ఆరేసి .. మళ్ళీ ఉతికి ఎండేసి .. సోము వీర్రాజు vs రజినీకాంత్ !

దశాబ్దకాలంగా తెలుగు టెలివిజన్ మీడియా లో టీవీ9 అగ్రగామిగా వెలుగొందుతోంది. ఆ ఛానల్ లో ప్రతి రోజు సాయంత్రం నిర్వహించే బిగ్ డిబేట్ కు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ డిబేట్ యొక్క సమన్వయకర్త రజినీకాంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ఫాలో అయ్యేవారికి బాగా సుపరిచితం. సమయం సందర్భం చూసుకుని ఎంతో సమయస్ఫూర్తితో ప్రశ్నలు సంధించడంలో అతను సిద్ధహస్తుడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏకపక్షంగా సాగేఇతర డిబేట్లకు…. tv-9 కు ఎంతో తేడా ఉంటుంది అనేది ప్రజల మాట. అయితే ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బిగ్ డిబేట్ లో టిడిపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొనగా…. ఆ చర్చ ఎంతో ఆసక్తికరంగా మారింది. సోము వీర్రాజు – రజినీకాంత్ ల మధ్య జరిగిన ఈ మాటల యుద్ధం లో చివరికి పైచేయి ఎవరిది…?

 

మొదటి రౌండ్ సోము ది

రజనీకాంత్ నుండి వచ్చే కీలక ప్రశ్నలకు వీర్రాజు బాగానే సన్నద్ధమై వచ్చినట్లు డెబేట్ ఆసాంతం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని పై క్లారిటీ కావాలని అధ్యక్షుడు గా నియమితులైన తర్వాత ఢిల్లీ వెళ్లి వచ్చిన సోము వీర్రాజు రజినీకాంత్ ను ప్రశ్నించారు. వారి పార్టీ వైఖరిలో మార్పు వచ్చిందా.. అని రజనీకాంత్ తనదైన శైలిలో సోము ని ప్రశ్నించారు. ప్రశ్నపై స్పందిస్తూ వీర్రాజు.. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని…. అసలు తమకు రెండు ఆలోచనకు తావు లేదని స్పష్టం చేశారు. అయితే రజినీకాంత్ కు ఇంకా సూటిగా సమాధానం చెప్పేస్తూ…. ఇది టిడిపి వైసిపి అనే రెండు పార్టీల మధ్య సమస్య అని అన్నారు.

ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రజలు వైసీపీ కి 151 సీట్లు, టిడిపికి 23 సీట్లు ఇచ్చారు…. అదే తమకు అధికారం ఇచ్చి ఉంటే ఈ సమస్యను ఆరు నెలల్లో పరిష్కరించే వారిమని చెప్పారు. నేరుగా రజనీకాంత్ తో పాటు ప్రజలను కూడా ఉద్దేశించి సోము వీర్రాజు ఇలాంటి ఖచ్చితమైన మాటలు మాట్లాడడం…. తమకు గుర్తింపుని ఇవ్వన్నప్పుడు…. ఈ సమయంలో మేము ఎలా రాజధాని గురించి అసలు సంబంధం లేకుండా సమాధానం ఎలా చెప్పాలని వీర్రాజు అనడం నిజంగా దూకుడైన విషయమే కానీ…. రజినీకాంత్ నోతిని అక్కడితో కట్టిపడేసింది అనే చెప్పాలి.

ఇది 50-50

ఇక వీర్రాజు పైన అన్న మాటలకి రజినీకాంత్ అప్పటికప్పుడు ప్రశ్న అల్లారో ఏమో తెలియదు కానీ…. “మీరు ఎదగాలంటే… అధికార పార్టీ మీద పోరాటం చేయాలి కానీ ప్రతిపక్ష పార్టీ మీద పోరాటం చేస్తున్నార”ని జనాలు అనుకుంటున్నారు అని రజినీకాంత్ సూటిగా ప్రశ్నించారు. దానికి వీర్రాజు సమాధానం నిజంగానే వీక్షకులను అలరించింది. మేము ఎవరి మీద పోరాటం చేస్తే ఏం జరుగుతుందో మాకంటూ ఒక అంచనా ఉంటుంది…. అందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అసలు ప్రజలకి వచ్చిన ఇబ్బంది ఏమిటి….? అని రజనీకాంత్ ను ప్రశ్నించారు. వాళ్ల గురించి మాట్లాడొద్దు వీళ్ళ గురించి మాట్లాడండి…. అనే ఈ విషయాన్ని మీరు కూడా డిసైడ్ చేస్తే తాము ఎందుకు…. తమ పార్టీ ఎందుకు అని వీర్రాజు అనడం గమనార్హం.

కాకపోతే ఇక ఇటువంటి సమాధానాలతో రజనీకాంత్ కు ముచ్చెమటలు పట్టించిన వీర్రాజు మాత్రం తర్వాత కొద్దిగా తడబడ్డారు అనిపించింది. కేంద్రంలో తమ పార్టీకి అధికారం ఉండడం వల్ల గల్వాన్ సమస్య (చైనా), ఆర్టికల్ 370 సమస్య అయోధ్య సమస్యలు పరిష్కరించామని చెబుతున్న సోము వీర్రాజు అన్న మాటలు వింటే…. అధికారం చేతిలో లేకపోతే ఏపీలో బీజేపీ ఎటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా లేదనే భావన ప్రజల్లో పడిపోయింది. ముందుగా ఆయన తమకు నచ్చినవారిని ప్రశ్నిస్తాం అని చెప్పడం కూడా దీనికి ఊతం ఇచ్చేలా ఉంది కాబట్టి అధికారం లేకపోయినా…. అధికార పార్టీని ప్రశ్నించడమేనది ఏపీ బిజెపి తత్వం కాదా…? అన్నట్టు సోము సమాధానాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు.

ఇది మాత్రం చాలా ఓవర్

మనిషికి విశ్వాసం ఉండొచ్చు కానీ అతి విశ్వాసం ఉండకూడదన్నది అందరి మాట. సోము వీర్రాజు కూడా కొద్దిగా టీవీ9 డిబేట్ లో అలాంటి అతి విశ్వాసమే ప్రదర్శించారు. ఇది అతను కావాలని చేశారా లేదా…. సహజంగా వచ్చేసిందా అన్న విషయం పక్కన పెడితే… ఆయన మాటలు చాలా మందిని అవాక్కయ్యేలా చేశయి. రాబోయే ఎన్నికల్లో టిడిపి వారికి ఉన్న సీట్లలో మెజారిటీ భాగాన్ని తామే కైవసం చేసుకుంటామని చెప్పడం… వైసిపి వారికి కూడా చాలా నియోజకవర్గాల్లో చుక్కలు చూపెడుతాం అన్నట్లుగా మాట్లాడారు అయితే మొత్తానికి ఎవరికీ పూర్తి మెజార్టీ రాదని.. దీంతో తాము అధికారాన్ని చేపట్టి… రాష్ట్రంలో చక్రం తిప్పుతామన్న ఆయన విశ్వాసం చూసి అంతా నోరు తెరిచారు. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేని బిజెపి వారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాము అని చెప్పడం నిజంగా అతిశయోక్తి ని కలిగించే అంశమే.

మొత్తానికి వీర్రాజు-రజనీకాంత్ ఈ డిబేట్ సమఉజ్జీల డిబేట్ లా అనిపించినా… అందరినీ బెంబేలెత్తించే రజినీకాంత్…. వీర్రాజు దగ్గర కొద్దిగా తడి పడగా వీర్రాజు మాత్రం…. తాను ఏమి మాట్లాడాలి అన్న విషయంలో క్లారిటీగా ఉన్నా…. తమ పార్టీ రాష్ట్రంలో అసలు తన ఉనికిని చాటుకోకపోయే సరికి అతను మాట్లాడిన కొన్ని మాటలకు…. రాష్త్రంలో బిజేపి వ్యవహార శైలికి కొద్దిగ కూడా పొంతన లేకపోవడంతో ప్రజలకు కొన్ని మాటలు నప్పలేదు.

Related posts

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju