NewsOrbit
Education News

TSPSC: తెలంగాణ TSPSC జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్.. వయసు, జీతం, అర్హత మొదలగునవి..!!

TSPSC:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ రిలీజ్ చేయడం తెలిసిందే. దాదాపు 1392 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి జీతం, అర్హత, సిలబస్, వయసు, పరీక్ష విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

TSPSC జూనియర్ లెక్చరర్స్ అప్లికేషన్ వివరాలు:

TSPSC జూనియర్ లెక్చరర్స్ పోస్టుల పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను నోటిఫికేషన్ నంబర్ 22/2022 ద్వారా, డిసెంబర్ 9, 2022న విడుదల చేసింది. ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా సంస్థలకు జూనియర్ లెక్చరర్లుగా పని చేయాలనుకునే అభ్యర్థులు ఈ డిసెంబర్ 16 నుండి పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 06-01-2023.

TSPSC Junior Lecturer notification all details including salary
TSPSC Junior Lecturer notification
TSPSC జూనియర్ లెక్చరర్ ల వయో పరిమితి:

ఈ పోస్టులకు వయోపరిమితి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. అంతేకాదు ఈ పరిమితి 01/07/2022 బట్టి వయసు ఉండాలి. రిజర్వేషన్ క్యాటగిరి ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఐదు సంవత్సరాలు వరకు వయో సడలింపుకు అర్హులు. ఇంక శారీరక వికలాంగులకు గరిష్టంగా 10 సంవత్సరాల వయస్సు సడలింపు కల్పించడం జరిగింది.

JL పరీక్ష ఫీజు వివరాలు:

అప్లై చేసుకోవాలి అని అనుకునే అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. ఇదిలా ఉంటే నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

TSPSC జూనియర్ లెక్చరర్ల జీతం & ప్రయోజనాలు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల జూనియర్ లెక్చరర్ జేతభత్యాలు చూస్తే ప్రారంభం ₹53,630.. నుండి దాదాపు ₹1,33,630 వేల వరకు వేతనం లభిస్తుంది. ఈ క్రమంలో టైర్వాన్ మరియు టైర్ టు నగరాలకు ఎంపికైన అభ్యర్థులు ఇతరుల కంటే ఎక్కువ పరిహారం పొందుకునే అవకాశం కూడా ఉంటుంది.

TSPSC Junior Lecturer notification all details including salary
TSPSC Junior Lecturer notification
TSPSC జూనియర్ లెక్చరర్స్ పరీక్షా సరళి:

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. రెండుసార్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొదటి పరీక్షలో అర్హత పొందితే మెయిన్ పరీక్ష వ్రాయవచ్చు. మొదటి పరీక్షలో మొత్తం 150 మార్కులకు గాను జనరల్ స్టడీస్ కి 50 మార్కులు, ఇంకా ఇంగ్లీష్ కి సంబంధించి 50 మార్కులు, సాధారణ సంబంధిత కరెంట్ అఫైర్స్ పై 50 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ పరీక్ష .. మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో కూడా సెలెక్ట్ అయితే చివరిగా ఇంటర్వ్యూ చేసి..అని ఫిజికల్ టెస్ట్ లు చేసి అప్పుడు ఉద్యోగంలో తీసుకుంటారు.

 

TSPSC తెలంగాణ జూనియర్ లెక్చరర్ పోస్ట్ లు సబ్జెక్టుల వారీగా ఖాళీ వివరాలు:

ఇంగ్లిష్ 153, హిందీ 117, జువాలజీ 128, ఫిజిక్స్ 112, కెమిస్ట్రీ 113 జూనియర్ లెక్చరర్ ల పోస్టులు.

1. అరబిక్ – 02

2.బోటనీ – 113

3. బోటనీ (ఉర్దూ మీడియం)-15

4.కెమిస్ట్రీ – 113

5. కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) – 19

6. సివిక్స్ – 56

7.సివిక్స్ (ఉర్దూ మీడియం) – 16

8. సివిక్స్ (మారాఠీ) – 01

9. కామర్స్ – 50

10. కామర్స్ (ఉర్దూ మీడియం) – 07

11. ఎకనామిక్స్ – 81

12. ఎకనామిక్స్ (ఉర్దూ) – 15

13. ఇంగ్లీష్ – 81

14.ఫ్రెంచ్ – 02

15. హిందీ – 117

16. హిస్టరీ- 77

17. హిస్టరీ (ఉర్దూ మీడియం) – 17

18. హిస్టరీ (మరీఠీ మీడియం) – 01

19. మ్యాథ్స్ – 154

20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) – 09

21. ఫిజిక్స్ – 112

22. ఫిజిక్స్(ఉర్దూ మీడియం) – 18

23. సాంస్క్రీట్(Sanskrit) – 10

24. తెలుగు – 60

25. ఉర్దూ – 28

26. జువాలజీ – 128

27. జువాలజీ (ఉర్దూ మీడియం) – 18

TSPSC పరీక్షా తేది:

వచ్చే ఏడాది జూన్ లేదా జూలై మాసంలో పరీక్ష నిర్వహించనున్నారు. TSPSC అధికారిక వెబ్ సైట్ నందు ఐడీ కలిగిన వాళ్లు .. దరఖాస్తు చేసుకునీ… పరీక్ష రాసే సమయానికి వారు ముందు హాల్ టికెట్ అందుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం జూనియర్ లెక్చరర్ పోస్టులు తీయడంతో పోటీ గట్టిగా ఉంటుందని మేధావులు చెప్పుకొస్తున్నారు.

Related posts

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

వైసీపీ లీడ‌ర్ కోసం ఆ నేత‌ను బ‌లిప‌శువును చేస్తోన్న చంద్ర‌బాబు.. పాపం క‌మ్మోడే…!

APPSC Group 2 Preparation Strategy: మీ ప్రైవేట్ ఉద్యోగం కి రాజీనామా చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాయాలనుకుంటున్నారా? ప్రేపరషన్ స్ట్రాటజీ మీ కోసం!

Deepak Rajula

Noble Peace Prize 2023

siddhu

TSPSC Group 2 Current Affairs: Most Important Telangana & Regional Current Affairs for TSPSC Group 2 Exam | TSPSC Telangana Current Affairs Part 1 in English

Deepak Rajula

International Schools Outlook: Understanding the Demand for Cambridge Curriculum in India | Parenting

Deepak Rajula

TSPSC Group 2 Current Affairs: 100 Important Current Affairs For Telangana State Service Commission Exams 2023 | Part 1

Deepak Rajula

UPSC Notification 2023: UPSC 2023 సివిల్ సర్విస్ నోటిఫికేషన్ రిలీజ్..!!

sekhar

TSPSC Current Affairs: Most Important Topics Part 2 | TSPSC Group 1, Group 2, Group 3, Group 4 Exams

Deepak Rajula

TSPSC Staff Nurse Notification 2023: TSPSC స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ డిపార్ట్మెంట్ వైస్ పోస్టులు.. ఖాళీలు..!!

sekhar

Type Writing Courses: టైపింగ్ కోర్సుల ద్వారా ప్రభుత్వ రంగాలలో భారీ ఎత్తున ఉద్యోగాలు పొందుతున్న యువత..ఫుల్ డీటెయిల్స్..!!

sekhar

Rashtriya Avishkar Abhiyan: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేంద్రం వినూత్న పథకం…రాష్ట్రీయ అవిష్కార్ అభియాన్(RAA)..!!

sekhar

TSPSC: తెలంగాణ TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తుల తేదీల మార్పు.. కొత్త తేదీ వివరాలు..!!

sekhar

Pawan Kalyan: టెన్త్ విద్యార్ధులకు హాపీ న్యూస్ ..ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కీలక సూచన

sharma somaraju