pragathi: సీనియర్ నటి ప్రగతి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న ప్రగతి.. కె.భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన `వీట్ల విశేషంగా` అనే తమిళ చిత్రంతో పదహారేళ్లకే హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు ఖాళీ లేకుండా ఏడు తమిళ సినిమాల్లో, ఒక మలాయళం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక చిన్నప్పటి నుంచి ఓ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కలలు కన్న ప్రగతి.. ఇరవై ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలు తనకు సెట్ కావని ఇండస్ట్రీకి దూరమై ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వివాహం తర్వాత ఎన్నో బాధ్యతలు పెరగడంతో.. ప్రగతి మళ్లీ ఏదో ఒక పని చేయాలనుకుందట. కానీ, తాను చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగం రాకపోవడంతో.. ఆమె సినీ ఇండస్ట్రీ వైపే మొగ్గు చూపి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే సినిమాల్లో అమ్మగా, అత్తగా, అక్కగా, పిన్నిగా ఇలా అనేక పాత్రలు పోషించి సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
అయితే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తాను చేసిన అత్తి పెద్ద పొరపాటని, తమ కాళ్ల మీద తాము నిలబడ్డాకే ఎవ్వరైనా పెళ్లి చేసుకోవాలని ప్రగతి చెబుతుంటుంది. ఇకపోతే, ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రగతి.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం డ్యాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫొటోలు, వర్కవుట్ వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.