Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మొత్తం మూడు సినిమాలతో రష్మిక ప్రేక్షకులను పలకరించింది. అందులో మిషన్ మజ్ను బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. వారసుడు మరియు యానిమల్ చిత్రాలు హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా యానిమల్ మూవీ పాన్ ఇండియాలో స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. రూ. 1000 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ కు జోడిగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తోంది. రష్మిక బర్త్ డే సందర్భంగా ఇటీవల పుష్ప 2 సినిమా నుంచి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన రెస్పాన్స్ లభించింది.
అలాగే రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌కు జోడిగా ఓ మూవీకి కమిట్ అయింది. మరోవైపు బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది. చేతినిండా చిత్రాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న రష్మిక మందన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. పుష్ప 2 మూవీలో తన క్యారెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప ది రైస్ మూవీతో రష్మిక నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో శ్రీవల్లి పాత్రలో ఆమె అదరగొట్టేసింది.
ఈ సినిమా తర్వాత ఆమెకు నార్త్ లో సైతం ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇక త్వరలో రాబోయే పుష్ప 2 చిత్రంలో తన పాత్ర మరో స్థాయిలో ఉండబోతుందని తాజాగా రష్మిక హింట్ ఇచ్చింది. తెరపై శ్రీవల్లి 2.0ను చూస్తారని ఆమె వ్యాఖ్యానించింది. మొదటి భాగం కన్నా మరింత బలంగా నా పాత్ర ఉండబోతోందని రష్మిక చెప్పుకొచ్చింది. ఇక ఇదే క్రమంలో ఫేవరెట్ మూవీ ప్రస్తావన రాగా.. రష్మిక నోటి వెంట షాకింగ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో తన మోస్ట్ ఫేవరెట్ మూవీ డియర్ కామ్రేడ్ అని తెలిపింది.
భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా 2019న తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్లతో విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో డియర్ కామ్రేడ్ విఫలం అయింది. ఇందులో విద్యార్థి సంఘం నాయకుడిగా విజయ్ దేవరకొండ, రాష్ట్ర స్థాయి క్రికెట్ క్రీడాకారిణిగా రష్మిక నటించారు.
వెండితెరపై విజయ్, రష్మిక కెమిస్ట్రీ అద్బుతంగా కుదిరినప్పటికీ.. కథలో దమ్ము లేకపోవడం వల్ల డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే ఈ డిజాస్టర్ మూవీనే తన ఫేవరెట్ మూవీ అని చెప్పి రష్మిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో డియర్ కామ్రేడ్ నా హృదయానికి ఎంతో దగ్గరైందని రష్మిక తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా.. ఆ సినిమాలో తన నటనకు ఎంతోమంది అభిమానులు నుంచి ప్రశంసలు, ప్రేమను అందుకున్నానని రష్మిక తెలిపింది.