Cinema

కృతికి ప్రపోజ్ చేసిన సుడిగాలి సుధీర్.. ఏకంగా పెళ్లి చేసుకుందాం అంటూ అడిగేశాడు..!

Share

జబర్దస్త్ అంటే వినిపించే పేరు సుడిగాలి సుధీర్.. అతని స్కిట్ వచ్చిందంటే చాలు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి.. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో కలిసి సుధీర్ చేసే రచ్చ అలాంటిది. కేవలం జబర్దస్త్ షో ద్వారానే సుడిగాలి సుధీర్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు హీరోగా కూడా కొన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అయితే బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే సుడిగాలి సుధీర్ అనే చెప్పాలి.. తన స్నేహితులు రాంప్రసాద్, గెటప్ శ్రీను పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే సుధీర్ మాత్రం 30 ఏళ్లు దాటినా పెళ్లి మాటెత్తడం లేదు.

అయితే గతంలో సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. ఎందుకంటే.. స్క్రీన్ పై ఇద్దరు రియల్ కపుల్ లా కలిసి ఉంటారు. వీరిద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందని ఎన్నో సార్లు చెప్పారు. కానీ అదంతా స్క్రీన్ పైనే.. షూటింగ్ అయిపోతానే ఎవరి దారి వారిది.. అయితే బుల్లితెర షోలలో మాత్రం సుధీర్ పెళ్లిపై జోకులు పేలుతూనే ఉంటాయి. సుధీర్ అమ్మాయిలు కనిపిస్తే పెళ్లి చేసుకుందామని అడుగుతాడని కామెడీ పంచ్ లు పడుతుంటాయి..

తాజాగా సుడిగాలి సుధీర్ హీరియిన్ కి ప్రపోజ్ చేశాడు. హీరోయిన్ కృతి శెట్టిని పెళ్లి చేసుకుందామని అడిగేశాడు. స్టార్ మాలో సూపర్ సింగర్స్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షోకు సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు. సూపర్ సింగర్ గ్రాండ్ ఫినాలేకు హీరో సుధీర్, కృతిశెట్టి జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా టీం వచ్చింది. ప్రమోషన్స్ లో భాగంగా వారు ఈ షోకు వచ్చారు. వేదికపై హీరో సుధీర్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు ఇంద్రగంటి మోహర్ క్రిష్ణ, అనసూయతో పాటు యాంకర్ సుడిగాలి సుధీర్ ఉన్నారు.

ఈక్రమంలో యాంకరింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ మాట్లాడటం మొదలు పెట్టాడు. ‘ఈ వేదికపై ఉన్న వారిలో పెళ్లికాని వారు ఇద్దరే ఉన్నారు.. అది ఒకరు కృతి శెట్టి, మరొకరు నేను’ అంటూ మొదలుపెట్టాడు. ఇక కృతికి లైన్ వేస్తున్న విషయాన్ని అనసూయ గమనించింది. ఈ విషయాన్ని సుధీర్ ని అడిగింది. అబ్బే అదేం లేదంటూ సిగ్గుపడుతూ అన్నాడు సుడిగాలి సుధీర్. ముందు కృతికి ఎలాంటి భర్త కావాలో తెలిస్తే ఈజీ అవుందని అనసూయ అన్నారు.

తనకు సపోర్టివ్, పాజిటివ్ యాటిట్యూడ్, కైండ్ హార్ట్, అర్థం చేసుకునేవాడు భర్తగా కావాలని, అన్నింటికి మించి నన్ను బాగా చూసుకోవాలని కృతి శెట్టి చెప్పింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ రెచ్చిపోయాడు. కృతి చెప్పిన లక్షణాలు అన్ని నాలో ఉన్నాయి.. పద పెళ్లి చేసుకుందాం అంటూ లవ్ ప్రపోజ్ చేసేశాడు. ఈ డ్రామా అంతా అందరిచేత నవ్వులు పూయించింది..


Share

Related posts

బ్రేకింగ్ : మరో ఆల్టైమ్ రికార్డు పై కన్నేసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్..!

arun kanna

Acharya: పోలీస్ స్టేష‌న్‌లో చిరంజీవి `ఆచార్య` సినిమాపై కేసు..!

kavya N

‘బాలయ్య 108’.. అప్పుడే రిలీజ్ డేట్ వచ్చేసింది?

Ram