అవికా గోర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `బాలికా వధు`(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ భామ.. `మార్నిగ్ వాక్` అనే హిందీ మూవీతో హీరోయిన్గా సినీ కెరీర్‌ను ప్రారంభించింది.
`ఉయ్యాల జంపాల`తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన అవికా గోర్.. అందం, టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఈ మధ్యలో బాగా బరువు పెరిగిపోవడం వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమైనా.. మళ్లీ నాజూగ్గా మారి కెరీర్‌పై దృష్టి సారింది.
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న అవికా.. రీసెంట్గా `థ్యాంక్యూ`తో ప్రేక్షకులను పలకరించింది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్లాపడింది. ఈ విషయం పక్కన పెడితే.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిన ఈ బ్యూటీ.. తరచూ అదిరిపోయే ఫొటో షూట్లతో నెటిజన్లు కవ్విస్తోంది.
కెరీర్ స్టార్టింగ్ నుండి పద్ధతిగా ఉన్న అవికా గోర్.. కొన్నాళ్ల నుండీ కురచ దుస్తుల్లో మెంటలెక్కించేస్తుంది. తాజాగా కూడా బికినీ ధరించి మాల్దీవుల వేదికగా మంటలు రేపింది. ఇందుకు సంబంధించి పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
వాటిని చూసి వామ్మో ఏంటీ అరాచకం అవికా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుంది. మరికొందరు ఆమె అందాన్ని పొగుడుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు వాటిపై మీరు లుక్కేసేయండి.