Avunu Valliddaru Istapaddaru: మనోజ్ పూజతో మాట్లాడుతుండగా ఒక అబ్బాయికి దెబ్బ తగిలి హాస్పిటల్ కి తీసుకు వస్తారు. ఇక వాళ్లతో పాటే పూజ కూడా హాస్పిటల్ కి వస్తుంది. ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కి o-ve బ్లడ్ అవసరం అని డాక్టర్ చెబుతారు.. ఇది రేర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పడంతో.. ఇక్కడ ఉన్న వాళ్ళందర్నీ టెస్ట్ చేయమని మనోజ్ అంటాడు. ఇక పూజ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వడంతో తన దగ్గర బ్లడ్ తీసుకోవడానికి.. మనోజ్ పూజ చేతుల్లో చేయి వేసి పట్టుకొని తనకి కబుర్లు చెబుతూ ఉంటాడు..

ఈలోపు నర్స్ పూజ చేతి నుంచి బ్లడ్ తీస్తుంది. ఆ తరువాత పూజ కు బ్లడ్ ఇచ్చినందుకు థాంక్యూ చెబుతాడు మనోజ్ . బ్లడ్ తీసినట్టే తెలియలేదు అని పూజ అంటుంది .ఊరినే గడగడ లాడించే నువ్వు బ్లడ్ ఇవ్వడానికి భయపడితే ఎలాగా అని మనోజ్ అంటాడు. ఏది ఏమైనా ఈరోజు ఆ అబ్బాయి ప్రాణాలతో బతికుండడానికి కారణం నువ్వే అని మనోజ్ పూజను ఆకాశానికి ఎత్తేస్తాడు.. పూజ మనోజ్ ని చూస్తూ అలాగే నిలబడి ఉంటుంది.

నాగరత్నం మనోజ్ తో పాటు ఢిల్లీకి కూడా పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతుంది. ఇప్పటికిప్పుడు సంబంధం దొరకాలి కదా అని అంతా అంటారు. నా కూతురు ఉంది కదా అని నాగరత్నం అంటుంది అందుకు అక్కడున్న వాళ్లు ఎవ్వరూ ఒప్పుకోరు.. కావాలంటే నీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం కానీ.. ఢిల్లీతో తన పెళ్లి చేయడానికి ఒప్పుకోమని అంటారు. దాంతో నాగారత్నం అన్యాయం చేస్తున్నారంటూ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో కళావతి ఫోన్ చేసి ఒక ప్లేస్ కి రమ్మని చెబుతుంది. మనోజ్ గెటప్ లో ఢిల్లీ అక్కడికి వస్తాడు. అంతలో ఢిల్లీ మచ్చ అంటూ చిట్టి పిలుస్తుంది. ఏంది ఢిల్లీ మచ్చా ఎవరు ఈ పాప అని అడగగానే కళావతి అని చెబుతాడు. ఏంది ఈ పాప కళావతి అయితే నేను ఎవరు.. నన్ను కాదు అనుకుని ఈ అమ్మాయిని కళావతి లాగా మాట్లాడటానికి మాట్లాడుతున్నావా.. ఇది అన్యాయం వచ్చా అంటూ కళావతి ముందే ఢిల్లీ మనోజ్ దగ్గర కళావతి లాగా మ్యానేజ్ చేస్తున్న సంగతి చెప్పేస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి.