Union Budget 2023: 2023 – 24 వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ లో విద్యా, ఉద్యోగ రంగాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపుల పెరిగాయి. 2023 – 24 ఆర్ధిక సంవత్సరానికి గానూ మొత్తం రూ.1,12,898.97 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.44,094.62 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు కేటాయించింది. గత ఆర్ధిక సంవత్సరం కంటే ఈ ఏడాదికి ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.9,752.07 కోట్లు అధికంగా కేటాయింపులు జరిపారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా
- రక్షణ శాఖ – రూ.5.94 లక్షల కోట్లు
- రోడ్డు, హైవేలు- రూ.2.70 లక్షల కోట్లు
- రైల్వే శాఖ రూ.2.41 లక్షల కోట్లు
- పౌరసరఫరాల శాఖ – రూ.2.06 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.1.6 లక్షల కోట్లు
- వ్యవసాయ శాఖ రూ. 1.25 లక్షల కోట్లు
రూపాయి రాక …
- 2023 – 24 మొత్తం బడ్జెట్ రూ.45.03 లక్షల కోట్లు
- మొత్తం ట్యాక్స్ ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు
- కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ.10.22 లక్షల కోట్లు
- ఆదాయ పన్ను రూపేణా వచ్చే ఆదాయం రూ.9.01 లక్షల కోట్లు
- జీఎస్టీ ద్వారా కేంద్రానికి వచ్చేది రూ.9.57 లక్షల కోట్లు
రూపాయి పోక..
- ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు
- వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44 లక్షల కోట్లు
- వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు
- పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13 లక్షల కోట్లు
బడ్జెట్ ప్రసంగంలో కీలక పాయింట్స్
- దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో ఉంది – నిర్మల
- దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్.
- ప్రస్తుత ఏడాదికి వృద్ది రేటు 7 శాతంగా అంచనా.
- 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది.
- మహిళా సాధికారత దిశగా భారత్ కృషి
- హరిత ఇంథనం కోసం ప్రత్యేక చర్యలు
- వ్యవసాయ రంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం
- గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత
- దేశ వ్యాప్తంగా 11.7 కోట్ల టాయిలెట్స్ నిర్మించాం