NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Serial January 17 2024 Episode 308: దుగ్గిరాల ఇంట్లో అనామిక గొడవ.. ధాన్యలక్ష్మి ఫైర్.. కావ్యకు అండగా రాజ్..

Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights

Brahmamudi Serial January 17 2024 Episode 308: కళ్యాణ్ అనామిక శోభనం గదిలో, అనామికకు ఇచ్చిన గిఫ్ట్ కావ్య సెలెక్ట్ చేసిందని చెప్తాడు.ఆ మాటలకు అనామికకి కోపం వస్తుంది. ప్రతి విషయంలోనూ నువ్వు మీ వదినని అప్పుని తీసుకురావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను కళ్యాణ్ అయినా నువ్వు మాత్రం మారలేదు ప్రతిదానికి నువ్వు వదినకి ముడి పెడతావు అని అంటుంది. ఈ నక్లెస్ చూసి నువ్వు బాగుందన్నావు కదా అది సెలెక్ట్ చేసింది నేను కాదు మా వదిన అని చెప్పాను అందులో తప్పేముంది అని అంటాడు కళ్యాణ్. ఇది సెలెక్ట్ చేసింది నువ్వు అని తెలిసి సంతోషించాను ఇప్పుడు నువ్వు కాదని తెలిస్తే నాకు చాలా కోపంగా ఉంది అని హారాన్ని పక్కకు విసిరేస్తుంది.భార్య కి భర్త గిఫ్టు ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసింది ఇవ్వడు అని అంటుంది.వేరే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంతా మనవాళ్లే కదా మా వదిన కదా అని అంటాడు కళ్యాణ్ అదిగో మళ్ళీ మీ వదిన గురించి మాట్లాడుతున్నావ్ అని అంటుంది అనామిక.పాపం తనేం చేసింది తను మన పెళ్లికి హెల్ప్ చేసింది అలాంటిది నూతనని అర్థం చేసుకోవట్లేదు అని అంటాడు కళ్యాణ్. చూడు కళ్యాణ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు తను మోసం చేసింది అప్పు నీ ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మోసం చేసి అక్క చెల్లెలు ప్లాన్ వేశారు అలాంటి వాళ్ల గురించి నువ్వు మన మధ్య మాట్లాడుతున్నావు అని అంటుంది. అనామిక నువ్వు అప్పుని కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను నాకు ఫ్రెండ్ మాత్రమే అని అంటాడు.

Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights
Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights

ఇక ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు.అనామిక చాలా కోపంగా నీలాంటి వాడితో శోభనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటుంది.ఆ మాటలకు కళ్యాన్ కోపం వస్తుంది.ఇప్పుడు నువ్వు చిన్న గొడవని కూడా పెద్ద చేస్తున్నావని ఇప్పుడేం తప్పు మాట్లాడాను అని అంటాడు. నువ్వు తప్పు మాట్లాడలేదు కళ్యాణ్ నాదే తప్పంతా అలానే మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్లని వెనకేసుకొచ్చి వాలని నెత్తిన పెట్టుకొని నన్ను పరాయి దాన్ని చేస్తున్నావ్ కళ్యాన్ అని అంటుంది అనామిక. వాళ్లకి చేస్తాను వాళ్లకి ఇచ్చాను నీకు ఇచ్చే ప్లేస్ నీకు ఇస్తున్నాను కదా అని అంటాడు కళ్యాణ్ దాంతో అనామిక నువ్వు ఇచ్చిన ప్లేస్ చాలా బాగుంది కళ్యాణ్. ఇంత జరిగిన తర్వాత ఈ గదిలో ఉండడం కూడా నాకు ఇష్టం లేదని గదంతా చంద్రవంతం చేసేస్తుంది కళ్యాణ్ నీకు పిచ్చి పట్టిందా అని అడుగుతాడు అవును నాకు పిచ్చి పట్టింది అని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటుంది అనామిక ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది అందరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటాడు ఐ డోంట్ కేర్ అంటూ దిండు తీసుకొని అనామిక హాల్ కి కెళ్ళి పడుకుంటుంది.

Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights
Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights

ఇక స్వప్న రుద్రానికి ఫోన్ చేస్తుంది. ఎంతసేపు ఫోన్ చేసినా రుద్రాణి ఫోన్ లిఫ్ట్ చేయదు. స్వప్న మాత్రం ట్రై చేస్తూనే ఉంటుంది. ఇక చేసేదేం లేక స్వప్న వదిలిపెట్టేలా లేదని, రుద్ర నీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.టైమెంతయింది నాకు నిద్రలేవగానే కాఫీ తాగాల్సిన అలవాటు ఉంది కదా కాఫీ తీసుకురండి అని అంటుంది ఇది ఎప్పటినుంచి అని అంటుంది రుద్ర అని ఈరోజు నేను చేయని అంటుంది. ఈరోజు నువ్వు తీసుకుని నిర్ణయం నాకు ఎలా తెలుస్తుంది అని అంటుంది అందుకే కదా ఫోన్ చేసి చెప్తున్నాను ముందు వెళ్లి కాఫీ తీసుకురండి అని అంటుంది.తొందరగా వెళ్లి కాఫీ తీసుకురండి అని అంటే లేచాను అని అంటుంది బయటకు వచ్చారా అని అంటుంది వచ్చాను అని కావాలని రుద్రా అని బయటికి రాకుండా సమాధానం చెప్పాలనుకుంటుంది నేను మీరు బయటే ఉన్నాను డోర్ తీయండి అని అంటుంది బయటికి వచ్చి రూమ్ తలుపు తీస్తుంది.మీరు వెళ్లి నాకు కాఫీ తీసుకురండి నేను కాసేపు పడుకుంటాను అని లోపలికి వెళ్తుంది స్వప్న. హలో సోఫా మీద పడుకున్నానా మీకు చూసి, ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి అని రుద్రాణి అందరి గదుల దగ్గరికి వెళ్లి తలుపు కొడుతుంది. ఇది ఇప్పుడు పెద్ద రచ్చ ఎలా ఉంది ఇంట్లో అని అనుకుంటుంది.ఇక అందరూ హాల్లోకి వచ్చి అనామిక సోఫాలో పడుకోవడం చూసి ఆశ్చర్యపోతారు రుద్రాణి అందరికీ చూడండి ఈ అమ్మాయి ఇక్కడ పడుకుంది అని చూపిస్తుంది.

Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights
Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights

ఇక ధాన్యలక్ష్మి అనామిక నిద్ర లేపుతుంది. అనామిక నిద్రలేచి అత్తయ్య అని ధాన్యలక్ష్మి పట్టుకుని ఏడుస్తుంది. ఏమైందమ్మా ఇక్కడ పడుకున్నావ్ ఏంటి అని అడుగుతుంది రాత్రి నుంచి ఇక్కడే ఉన్నావా అని అడుగుతుంది అవును అని అంటుంది అనామిక అప్పుడే కళ్యాణ్ మేడ మీద నుంచి కిందకి వస్తాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అనామిక చెప్తున్నా మాటలకు షాక్ అవుతారు. ఏమైందో చెప్పమని అనామిక అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు కానీ అనామిక సైలెంట్ గా ఉంటుంది కళ్యాణ్ రాగానే అందరూ కళ్యాన్ అడగడం మొదలుపెడతారు. కళ్యాణ్ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు వెంటనే రాజ్ ఏమైందిరా ఒక ఆడపిల్ల గదిలో నుంచి బయటికి వచ్చి ఇలా ఏడుస్తుంది అంటే నువ్వు ఏమన్నావు అని అంటాడు. రుద్రాణి శోభనం గదిలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏముంది మీరు మీరు మాట అనుకుంటే అక్కడే సర్ది చెప్పుకోవాలి కానీ ఒక ఆడపిల్ల ఏడుస్తూ బయటికి వచ్చిందంటే అర్థం ఏంటి నువ్వేమన్నావు అని గట్టిగా అడుగుతుంది. ధాన్య లక్ష్మి ఏమైందో చెప్పు కళ్యాణ్ అని అంటుంది. వెంటనే, నేనేం చేయలేదమ్మా తను అపార్థం చేసుకొని వచ్చింది అని అంటాడు చిన్న విషయానికి అపార్థం చేసుకునేలా కనిపిస్తున్నానా నేను అని అంటుంది అనామిక. నాకు రెండే దారులు కనిపిస్తున్నాయా అత్తయ్య ఒకటి నేను పుట్టింటికి వెళ్లడం లేదంటే చచ్చిపోవడం అని అంటుంది అనామిక ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అసలు గొడవేంటో చెప్పకుండా ఇలా చేస్తే ఎలాగో అని అంటుంది. రాహుల్ మా అత్తయ్య ఇప్పుడు కొడుకు చేసిన పనికి ఏ తీర్పిస్తుందో చూడాలని ఉంది అని అంటాడు నువ్వు తప్పు చేశావని అందరూ అలా ఉండరు రాహుల్ కళ్యాణ్ ఎప్పుడు ఒకల మనసు బాధ పెట్టలేదు అని అంటుంది స్వప్న. అవును కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు కానీ అనామిక ఎందుకు బాధపడుతుందో నోరు తెరిచి చెప్తేనే కదా తెలిసేది అంటుంది ఇందిరా దేవి. రుద్రాణి సైలెంట్ గా ఉంటే ఎలా తెలుస్తుంది ఏం గొడవ జరిగిందో చెప్పండి అని అంటుంది ఇక అపర్ణ ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటుంది.

Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights
Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights

ఇక అనామిక కళ్యాణ్ నన్ను కొట్టిన తిట్టినా నేను గదిలోనే పడి ఉండేదాన్ని కానీ శోభనం గదిలో అప్పు ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇక కావ్య గురించి మాట్లాడుతున్నాడు అని అనామిక చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నేను వాళ్ల వదిన ఒక మాట కూడా అనకూడదుట వాళ్ళ వదిన దేవత అప్పు ఒక ప్రేమ దేవత భార్యగా నాకు విలువ లేదు వీళ్ళిద్దరికీ ఇచ్చినంత విలువ నాకు ఇవ్వట్లేదు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా అని సుభాష్ అంటాడు అనామిక నీకు దండం పెడతాను మధ్యలో మా వదిన తీసుకురావద్దు అని అంటాడు కళ్యాణ్. చూశారా ఇప్పుడే చూశారు కదా ఎలా మాట్లాడుతున్నాడో వదిన గురించి ఒక మాట కూడా మాట్లాడకూడదు నేను ఒక్క మాట అన్నా తట్టుకోలేడు కానీ నన్ను మాత్రం భయం చేయొచ్చా అని అంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి, అమ్మ మహా తల్లి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా సంతోషించాయా ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా సత్యనారాయణ స్వామి వ్రతం చెడగొట్టాలనుకున్నావు అసలు పెళ్లి చెడగొట్టాలనుకున్నావు అని చెల్లెలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అని అంటుంది. నేనేమన్నా అనుకోలేదు అత్తయ్య అని అంటుంది కావ్య. అలా అనుకోకపోతే ఎలా అనుకున్నావు మీ గురించి నాకు తెలియదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి వెంటనే రాజ్ కావ్యకి సపోర్టుగా మాట్లాడుతాడు. రాజ్ చూడు పిన్ని నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నీ కొడుకు కోడలు గదిలో జరిగిన దానికి కావ్య మధ్యలో తీసుకురావద్దు తనకేం తెలీదు కానీ తప్పు చేసినట్టు మీరందరూ మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు వెంటనే ధాన్యలక్ష్మి చూసావా అక్క నీ కొడుకు ఎలా మారిపోయాడు నీ కొడుకు కూడా మార్చేసింది ఇంకా నేను అయిపోయాను ఈరోజు ఈ పిన్ని గయ్యాలది అయిపోయింది రాజ్ అని, అంటుంది ధాన్యలక్ష్మి అది కాదు పిన్ని అని అంటాడు రాజ్. అమ్మ మహా తల్లి ఎప్పుడైనా నీకు సంతోషంగా ఉందా అని అంటుంది కావ్య వైపు చూసి. అడ్డమైన వాళ్ళందరి విషయాల్లో నన్ను మాట్లాడొద్దంటున్నాడు అని అంటుంది దాన్ని లక్ష్మి వెంటనే కావ్య ఇక్కడ అడ్డమైన వాళ్ళు ఎవరు ఆ పదం వాడకండి అని అంటుంది. అవును నువ్వు నాకు పద్ధతుల గురించి నేర్పుతున్నావు నువ్వు అప్పు అని నా కొడుకు కిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అని అంటే మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. నేనెప్పుడూ అలా అనుకోలేదు అని అంటుంది కావ్య. మధ్యలో స్వప్న మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో రావాకు అని అంటుంది. ఇలా అందరూ కావ్యని అంటూ ఉంటే రాజ్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే గట్టిగా కళ్యాణ్ అని అరుస్తాడు. ఇక అందరూ రాజ్ వైపు చూస్తారు.

Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights
Brahmamudi Serial January 17 2024 today 308 episode highlights

రేపటి ఎపిసోడ్ లో, అనామిక దగ్గరికి కావ్య వెళ్లి, మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు నా గురించి కానీ అప్పు గురించి గానీ ప్రస్తావన తీసుకురాకండి మేమునీ గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు అనుకోము కూడా మా నుంచి ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని చెబుతుంది. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి ప్రేమగా రాజు చేయి పట్టుకొని మీరు నాకు తోడుగా ఉంటే నేను గోవర్ధనగిరిని కూడా ఒక చేత్తో ఎత్తగలనండి అంత నమ్మకం ఉంది అని కావ్య ప్రేమగా రాజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది రాజ్ కాస్త ఇబ్బందిగా ఉంటాడు ప్రేమగా కావ్య దగ్గరికి వెళ్తుంది..

Related posts

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N