Devatha: జానకమ్మ రాధా గదిలో బట్టలు అన్ని సర్దుకొని పెట్టి ఉండడం చూసి ఏమైంది మామూలుగానే రాధా బయటికి రాదు అలాంటిది ఇన్ని బట్టలు సర్దుకుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో రాధ బయట నుంచి వస్తుండగా ఏమైందమ్మా రాదా ఇప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నావ్ ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది ఇక్కడికే బయటికి వెళ్లి వచ్చాము అని భాగ్యమ్మ చెబుతుంది వేరే చోట అద్దెకు ఇల్లు తీసుకున్నాము అని భాగ్యమ్మ అంటుంది ఎన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావు అని జానకమ్మ అంటుంది అప్పుడే భాగ్యమ్మ ఇన్ని దినాలు ఇక్కడే ఉంది కదా అందుకని ఇక దేవిని తీసుకొని తను కూడా బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంది అని అంటుంది..
ఆదిత్య పిల్లల్ని వదిలి పెట్టాలని ఇంటికి వస్తాడు.. అప్పుడే మాధవ్ ఆదిత్య కు అడ్డుపడి నీకు ఎన్ని సార్లు చెప్పాలి.. నా పిల్లల్ని నిన్ను మీ ఇంటికి తీసుకు వెళ్ళద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. అయినా అప్పుడప్పుడు మీ ఇంటికి తీసుకు వెళ్లడం నుంచి రెండు రోజులు మీ ఇంట్లో ఉంచుకునే అంతవరకు వచ్చేసాను.. అంటే ఇక దేవి నీతోనే పర్మినెంట్ గా వచ్చేస్తుంది అని అనుకుంటున్నావా.. అది ఎప్పటికీ జరగదు అని ఆదిత్య కు మాధవ్ వార్నింగ్ ఇస్తాడు.. అప్పుడే రుక్మిణి వచ్చి నువ్వు ఎవరి సారు ఆ మాట మాట్లాడడానికి ఆయన నా పెనిమిటి ఆయన బిడ్డను ఆయన తీసుకెళ్లే హక్కు ఉంది..
నువ్వు కూడా ఇలా సపోర్ట్ చేస్తే ఎలాగా రాదా అని మాధవ్ అంటాడు.. నా పెనిమిటి కి నేను కాకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తాను నా పెనిమిటి నా మెడలో కట్టిన తాళిబొట్టు ఇంకా అలాగే ఉంది. అయినా నువ్వు ఇంకా ఈ మాధవ సారి మాట్లాడుతున్న మాటలు వింటావేంటి పెనిమిటి.. నువ్వు ఇక్కడ ఎవ్వరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. నువ్వు వెళ్ళు పెనిమిటి.. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను అని రుక్మిణి ధైర్యంగా ఆదిత్య ముందు మాధవ్ కి సమాధానం చెబుతుంది.. మాధవ్ ఆ మాటలు విని షాక్ అవుతాడు..