NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 3 2024 Episode 195: అందరి లెక్కలు తేలుస్తా అంటున్న దివ్యాంక,గేటు కూడా దాటనివ్వను అంటున్న జగదాత్రి..

Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights

Jagadhatri April 3 2024 Episode 195: నిజం చెప్తున్నాను నిషిక నలుగురిని గౌరవించడంలో ఉంటుంది క్లాస్ నీ అకౌంట్లో జీరోలు ఎక్కువ ఉన్నంత మాత్రాన క్లాస్ ఉండదు అని అఖిలాండేశ్వరి అంటుంది. ఇంతలో దివ్యాంక అక్కడికి వస్తుంది. హాయ్ అఖిలాండేశ్వరి గారు అని దివ్యాంక అంటుంది.  ఈవిడని నేను పిలవలేదు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు ఎలా వచ్చింది అని అఖిలాండేశ్వరి అంటుంది. నేనే నిషిక ని పిలిపించాను ఇన్విటేషన్ కార్డు కూడా ఇచ్చాను అని నిషిక అంటుంది. నిషి దివ్యాంకను ఎందుకు పిలిచావు అని కౌశికి అడుగుతుంది. నువ్వు ఈ జగదాత్రిని ఎందుకు పిలిచావో నేను అందుకే పిలిచాను వదిన అని నిషిక చెబుతుంది. వాళ్లు మన ఫ్యామిలీ కాబట్టి పిలిచాను అని కౌశికి అంటుంది. తను కూడా నా స్నేహితురాలు కాబట్టి పిలిచాను వదిన అని దివ్యాంకని తీసుకొని వెళుతుంది నిషిక. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights
Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights

 

దివ్యాంక నిజంగా నువ్వు ఇక్కడికి ఫంక్షన్ కి వచ్చావా లేదంటే అఖిలాండేశ్వరి చెప్పినట్టు బిజినెస్ ఇవ్వనంటే పగ తీర్చుకోవడం కోసం వచ్చావా అని నిషిక అడుగుతుంది. ఆ అఖిలాండేశ్వరి తో కొన్ని లెక్కలు తేల్చుకునేటివి ఉన్నాయి నిషిక అందుకే వచ్చాను అని దివ్యాంక అంటుంది. ఈ ఫంక్షన్లో ఎవరికి ఏం జరిగినావు చూస్తూ ఊరుకోను అని జగదాత్రి అంటుంది. మా మాటలు చాటుగా వింటున్నావా అని నిషిక అంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు దివ్యాంక అని జగదాత్రి అంటుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నా మొహం చూసి చెప్పు అని దివ్యాంక అంటుంది. అఖిలాండేశ్వరి గారు నీకు తన కాంట్రాక్టర్ ఇవ్వననేసరికి తన మీద పగ తీర్చుకోవడం కోసం వచ్చావు అని జగదాత్రి అంటుంది. తను చెప్పేది నిజమా చెప్పు దివ్యాంక అని నిషిక అడుగుతుంది. తను మౌనంగా ఉందంటే ఇంకా అర్థం కావట్లేదా నిషి అని జగదాత్రి అంటుంది. ఏ జగదాత్రి నా గురించి తెలియక నాతో పెట్టుకున్నావు నీ లెక్కలు ఈ అఖిలాండేశ్వరి లెక్కలు అన్ని తేలుస్తాను ఇక్కడ జరిగేదంతా షూట్ చేసి నా ఛానల్ లో టెలికాస్ట్ చేస్తాను అని దివ్యాంక అంటుంది.

Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights
Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights

టెలికాస్ట్ చేసి గేటు కూడా దాటనివ్వను నీ ఎంగేజ్మెంట్ లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా నీ అంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి జగదాత్రి వెళ్ళిపోతుంది. దివ్యాంక ఇక్కడ ఏమీ జరగకూడదు ఏ చిన్న డౌట్ వచ్చినా అఖిలాండేశ్వరి చాలా డేంజర్ జగదాత్రి ఇవ్వాళ కాకపోతే రేపు దొరుకుతుంది తను ఎక్కడికి పోతుంది అని నిషిక అంటుంది. అలాగని నా ముందు కుప్పిగంతులు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని దివ్యాంక అంటుంది.దాని సంగతి తర్వాత చూసుకుందాం వెళ్లి అక్కడ అందరిలో కూర్చో అని నిషిక వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights
Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights

రౌడీలు హేమని సాపలో మూట కట్టుకొని తీసుకు వెళ్తూ ఉంటారు. అది చూసి నా సెక్యూరిటీ ఆ మూట ఏంటి అని అడుగుతాడు. డెకరేషన్ కి సంబంధించిన వస్తువులు బాబు అని వాళ్ళు చెబుతారు. ఒకసారి దించి చూపించండి అని సెక్యూరిటీ అనడంతో ఇంతలో యువరాజు వచ్చి అవి నిజంగానే డెకరేషన్ సామాన్లు వెళ్ళనివ్వు అని చెబుతాడు.  హేమాని తీసుకొని వెళుతూ ఉండగా జగదాత్రి వస్తుంది. ఏంటది చాపను అలా చుట్టు తీసుకువెళ్తున్నారు అని అడుగుతుంది. డెకరేషన్ సామాన్లు మేడం అని వాళ్ళు అంటారు. ఏది ఒకసారి దించి చూపించండి అని జగదాత్రి అంటుంది. నీకెందుకు చూపించాలి  అని వాళ్ళు అంటారు. చూపిస్తారా దేవా ని పిలుచుకు రమ్మంటారా అని జగదాత్రి అనడంతో వాళ్లు చాప కింద పెడతారు. జగదాత్రి విప్పి చూడబోతూ ఉండగా పార్వతి పిలుస్తుంది. జగదాత్రి వెళ్ళిపోతుంది రౌడీ హేమ ని తీసుకొని వెళ్ళిపోతారు. జగదాత్రి హేమా కనిపించడం లేదు అనే పార్వతి అంటుంది. ఇక్కడే ఎక్కడ ఉంటుంది వెతుకు దంపత అనే జగదాత్రి పార్వతీ వెతుకుతూ ఉంటారు.యువరాజ్ మీనన్ కి ఫోన్ చేసి పెళ్లికూతురుని కిడ్నాప్ చేసి పంపించాను అని చెబుతాడు. చాలా థాంక్స్ యువరాజ్ నువ్వు చేసిన మేలు మర్చిపోలేను నువ్వు కూడా వచ్చే అందరం పార్టీ చేసుకుందాం అని అంటాడు. ఇప్పుడు వస్తే డౌట్ వస్తుంది బాయ్ తర్వాత వస్తాను అని యువరాజ్ ఫోన్ కట్ చేస్తాడు. అఖిలాండేశ్వరి నాతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పుడు నీకు కాబోయే కోడల్ని నీ కొడుకు ఎలా కాపాడుతాడో చూస్తాను అని అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights
Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights

కౌశికి నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అని అఖిలాండేశ్వరి అంటుంది. బిజినెస్ పరంగా మీతో సేమ్ ఉంటుంది కానీ ఫ్యామిలీని చూసుకోవడంలో మాత్రం లేదు మేడం అని దివ్యాంక అంటుంది. తనను చూస్తేనే తెలుస్తుంది కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటుందో మూడు ఫ్యామిలీలు కలిసి ఉంటున్నాయి అంటే అర్థం కావట్లేదా తను ఎంత బాగా కుటుంబాన్ని చూసుకుంటుందో అని అఖిలాండేశ్వరి అంటుంది. దివ్యాంక అన్నది అది కాదు మా అక్క సొంత ఫ్యామిలీ గురించి మా అక్క మా బావ విడిపోయారు అని కాచి చెబుతుంది. తన సక్సెస్ కాగానే నిరుపేదైనా భర్తని వదిలేసింది నేను పెళ్లి చేసుకుంటాను అంటే తను కుట్రలు చేసి నా పెళ్లి కూడా జరగకుండా ఆపుతుంది అని దివ్యాంక అంటుంది. కౌశికి గురించి నీకేం తెలుసు ని మాట్లాడుతున్నావ్ దివ్యాంక నిజానికి తన గురించి నాకు కూడా ఏమీ తెలియదు పర్సనల్ విషయాలు నలుగురిలో మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం నీకు లేదా సక్సెస్ అయిన ప్రతి ఆడది భర్తకు గౌరవం ఇవ్వదని అంటే నేను ఒప్పుకోను భార్యాభర్తలు విడిపోయారు అంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు ఇక ఆ విషయం గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది అని అఖిలాండేశ్వరి అంటుంది. చాలా బాగా చెప్పావమ్మా అని దేవా అంటాడు. ఇంతలో జగదాత్రి పార్వతీ వచ్చి హేమా కనిపించడం లేదు అని చెబుతారు. ఇక్కడే ఎక్కడ ఉంటుంది వెళ్లి వెతకండి అని దేవా అంటాడు.అంత వెతికాను పెదబాబు గారు ఎక్కడా లేదు అని పార్వతి చెబుతుంది. నిన్ను హేమ దగ్గరే ఉండమన్నాను కదా ఎక్కడికి వెళ్ళిపోయావు అని భవాని అంటుంది. ఇందాక ఇక్కడికి వచ్చాను కదా అమ్మగారు అప్పుడు నిషిక హేమ అక్కడే ఉన్నారు ఇప్పుడే కనిపించడం లేదు అని పార్వతి అంటుంది.

Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights
Jagadhatri Today Episode April 3 2024 Episode 195 highlights

నేను ఇక్కడే ఉన్నాను దాక హేమ ని ఎవరో కిడ్నాప్ చేస్తుంటే ఎవరో కాపాడారని చెప్పింది అని నిషిక అంటుంది.ఆ విషయం మరి ఇందాక చెప్పలేదు ఎందుకు అని దేవా అంటాడు. ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుందని ఊరుకున్నాను అని నిషిక అంటుంది. అయితే హేమ ని ఎవరు తీసుకు వెళ్లారు అని అఖిలాండేశ్వరి అంటుంది. ఇంకెవరు ఆ మీనన్ తీసుకువెళ్లి ఉంటాడు తనకు బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇవ్వనన్నారని నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు తప్పు చేసింది మీరైతే నా కూతురికి నాకు శిక్ష పడాల అఖిలాండేశ్వరి గారు ఆరోజు రెండు నిమిషాలు లేట్ అయితేనే పెద్దగా మాట్లాడారు ఇప్పుడు ముహూర్త టైంకి ఉండవలసిన పిల్ల ఇంట్లో లేదు ఏం చేస్తారు అని అడుగుతాడు హేమ వాళ్ళ నాన్న. మీరే మీ టెన్షన్ పడకండి అంకుల్ ముహూర్తం టైం కి నేను హేమని తీసుకు వస్తాను అని దేవా చెబుతాడు. కేదార్ జగదాత్రి పార్వతీ దేవా నలుగురు హేమని వెతకడానికి వెళ్తారు..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella