Krishna Mukunda Murari: స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ దక్కించుకుంటున్న టాప్ 3 డైలీ సీరియల్స్ లో ఒకటి కృష్ణ ముకుంద మురారి ఎంతో ఆసక్తి కరంగా సాగుతూ ఇప్పుడు 181 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Krishna Mukunda Murari: కృష్ణ దగ్గర మాట తీసుకున్న రేవతి.. మురారి మీద కృష్ణ కోపం..
మురారి తనని ప్రేమించడం లేదని బాధపడుతున్న ముకుంద:
మురారి తనని తన తల్లి తో కలిసి అమెరికా కి వెళ్ళు అని చెప్పడం తో ముకుంద ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు తన స్నేహితురాలు గీతికా ఫోన్ చెయ్యగానే ఆమెతో మాట్లాడుతూ మురారి నన్ను మా అమ్మతో కలిసి అమెరికా కి వెళ్ళమన్నాడు, నా మీద ప్రేమ లేదేమో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గీతికా అదేమీ లేదు, మీ అమ్మకి బాగలేదు కదా,ఆమె మీద అక్కరుతో నువ్వు దగ్గరుండి చూసుకుంటావు అనే ఉద్దేశ్యంతో అలా అని ఉంటాడు అంటుంది గీతికా. అంతే అంటావా, ఇప్పటి వరకు చాలా బాధపడుతూ ఉన్నాను, నువ్వు ఈ మాట అనేలోపు నాలో చాలా ధైర్యం వచ్చింది అని చూపండి ముకుంద.

ముకుంద మొహం చూసి ఆమె మనసులో మాట చెప్పేసిన కృష్ణ :
ఇక ఆ తర్వాత హాల్ లోకి వచ్చి మురారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ముకుంద, ఇది గమనించిన రేవతి అత్తయ్య ఇదేంటి ఇలా చూస్తుంది , మురారి కోసం ఎదురు చూస్తుంది అనుకుంట అని మనసులో అనుకుంటూ ఏమిటి ముకుంద ఇక్కడ ఒంటరిగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది. నా బ్రతుకు మొత్తం ఒంటరి కదా అత్తయ్య అనగా, ఏమి చేస్తాం మన జీవితాలు ఎప్పటికైనా సున్నాకి రావాల్సిందే అని అంటుంది. ఇక అప్పుడే కృష్ణ మరియు మురారి తమ పనులు చేసుకోవడానికి బయలుదేరుతుండగా, రేవతి మరియు ముకుంద ని కలుస్తారు. రేవతి మొహం చూడగానే ఏమిటి అత్తయ్య ఇప్పటి దాకా బాగా పని చేసి వచ్చినట్టు ఉన్నారు అని అనగా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు అని అంటుంది రేవతి. అప్పుడు మురారి కృష్ణకి ఫేస్ రీడింగ్ తెలుసు అమ్మా , ఎవరి ముఖం చూసిన వాళ్ళ మనసులో ఏమి ఉంటుందో ఇట్టే చెప్పేస్తుంది అని అంటాడు. అప్పుడు ముకుంద నా మొహం చూసి నేను ఏమి అనుకుంటున్నానో చెప్పు అంటుంది. అప్పుడు రేవతి ఇది కచ్చితంగా తన మనసులో మురారి ఉన్నాడు అని బయటకి చెప్పేస్తుంది ఏమో అని అనుకుంటుండగా, ముకుంద మొహం చూసి ఇప్పుడు నువ్వు మీ అమ్మగారి ఆరోగ్యం గురించి కాకుండా, వేరే ఎవరి గురించో ఆలోచిస్తున్నావు అని అంటుంది. అప్పుడు ముకుంద అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు, నేను ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది.

కృష్ణ కాళ్లకు మెట్టెలు తొడిగిన మురారి :
ఇక ఆ తర్వాత రేవతి కృష్ణ మరియు మురారి ని కలిపే ఒక అద్భుతమైన ప్లాన్ చేస్తుంది. ఈరోజు పౌర్ణమి, భర్త భార్య రెండు కాళ్లకు మెట్టెలు తొడిగితే కలకాలం జీవితాంతం శివ పార్వతులు లాగ కలిసిమెలిసి ఉంటారు అని చెప్తుంది. రేవతి చెప్పినట్టుగానే మురారి కృష్ణ రెండు కాళ్లకు మెట్టెలు తొడుగుతాడు. ఇదంతా చూస్తూ ముకుంద ఉడికిపోతూ ఉంటుంది, ఆమె ఫీలింగ్స్ ని గమనించిన రేవతి ముకుంద ని పిలిచి , చాలా థాంక్యూ అమ్మా, నువ్వు ఒక కాపురాన్ని కాపాడావు,

నువ్వే కనుక కృష్ణ మరియు మురారి అగ్రిమెంట్ పెళ్లి గురించి చెప్పి ఉండకపొయ్యుంటే, నేను ఇలా వాళ్ళు శాశ్వతంగా కలిసి ఉండే పనులు చేసేదానిని కాదు, ఇందాక ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నాను అని అబద్దం చెప్పావు, అది నిజం చెయ్యి, అసాధ్యమైన వాటి గురించి అలోచించి సమయం వృధా చేసుకోకు అని అంటుంది, ఇక మరోపక్క కృష్ణ మరియు మురారి కారులో వెళ్తుండగా మురారి కారు ఆపండి ACP సార్, ఇందాక మీరు తొడిగిన మెట్టెలు నా కాళ్లకు గుచ్చుకుంటున్నాయి, అవి సెట్ చెయ్యాలి అని అంటుంది.మురారి కారు ఆపగానే , కృష్ణ తన కాళ్ళను తీసి మురారి వడిలో పెట్టి సెట్ చెయ్యమంటుంది, మురారి సెట్ చేస్తాడు. రేపటి ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో చూడాలి.