NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: పెళ్లి విషయంలో భవానిని నిలదీసిన మురారి.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights

Krishna Mukunda Murari: భవాని పెళ్లి పనులు మొదలు పెట్టండి అని ఇంట్లో వాళ్ళందరకి చెబుతుంది. రేవతి రేపే పసుపు కొట్టి అన్ని స్టార్ట్ చేయాలి అని అంటుంది. రేవతి మౌనంగా ఉండిపోతుంది అప్పుడు ముకుంద రేవతి అత్తయ్యకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు రేవతి నాకు ఇష్టం లేకపోవడం లేదు అలాని ఇష్టం లేదు అని అంటుంది. ఇక ఇంటికి ప్రసాద్, తన భార్య ఇద్దరు వస్తారు. సుమతి అక్క ఈ పెళ్లంటే మురారి కి ఇష్టం లేనట్టుంది అని అంటుంది ఇందాక వచ్చేటప్పుడు మురారి కృష్ణ దగ్గరే ఉన్నాడు అని చెబుతుంది ఆ తర్వాత ప్రసాద్ నీకు కూడా మనసులో ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగమని భవాని అంటుంది అప్పుడు ముకుందా ప్రసాద్ మావయ్యకు అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పగా ఉండమ్మా ముకుందా నాకు కూడా ఒక సందేహం ఉంది.

Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights
Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights

ఇప్పుడంటే మురారి కి గతం గుర్తుకు రాలేదు కాబట్టి మనం ముకుందని ఇచ్చి పెళ్లి చేస్తున్నాము. ఆ తర్వాత మురారి కి గతం గుర్తుకు వస్తే మురారి పరిస్థితి ఏంటి? ముకుంద జీవితం అన్యాయం అవుతుందని నాకు అనుమానంగా ఉంది వదిన అని ప్రసాద్ తన మనసులోని మాటను బయటపడతాడు. ఇక నాకు అదే అనుమానం అని రేవతి, ఆ తరువాత నందిని కూడా అదే విషయానికి మద్దతు చెప్పబోతుండగా.. షట్ అప్ అని భవాని పెద్దగా అరుస్తుంది. అసలు అది ఒక పెళ్లా, అయినా మనకి ద్రోహం చేసిన వాళ్ళ గురించి మీరు ఇంకా ఎలా ఆలోచిస్తున్నారు అని భవాని ఇంట్లో వాళ్ళందరికీ చివాట్లు పెడుతుంది ముకుందా నీకు మురారిని దగ్గరుండి చూసుకోమని చెప్పాను కదా అయినా నువ్వేం చేస్తున్నావు అని భవాని ముకుందను కూడా అరుస్తుంది. తను స్కూల్ పిల్లాడిలా అక్కడికి నేను వెళ్తుంటే నేను తనకి శత్రువు అవుతున్న కానీ భార్యను కాలేకపోతున్నా వీళ్లంతా కాస్త కట్టడి చేస్తే బాగుంటుంది అని ముకుంద అంటుంది. అర్జెంటుగా నువ్వు వెళ్లి మురారిని పిలుసుకోరా అని భవాని ముకుందని పంపిస్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లందరికీ ఒక విషయం చెబుతున్నా.. ఇలాంటి పుచ్చు అనుమానాలతో మీ కాలాన్ని వృధా చేయకుండా పెళ్లి ఎలా చేస్తే బాగుంటుంది. ఘనంగా ఎలా చేయాలి అనే విషయం మాత్రమే ఆలోచించండి అని భవాని చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights
Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights

మురారి తనకి ఈ పెళ్లంటే ఇష్టం లేదని, ఇప్పుడు నేను నో అని చెబితే తన లైఫ్ స్పాయిల్ చేయొద్దని అనుకుంటున్న, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అది తనతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదని మురారి అంటాడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది సార్, మీరు అనుకున్నదే జరుగుతుంది. నాపై నమ్మకం ఉంచండి అని అంటుంది. మీరంటే నాకు అని మురారి కృష్ణ తో చెప్పబోతుంటే ముకుంద అక్కడికి వస్తుంది. మురారి పెద్దత్తయ్య రమ్మంది అని ముకుంద పిలుస్తుంది. ఇక తప్పక మురారి అక్కడి నుంచి వచ్చేస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights
Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights

మురారి ఇంటికి వచ్చాక తింగరి అంటే ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మురారి దగ్గరకు నందు, గౌతమ్ వస్తారు. తింగరి అంటే ఏమిటి అని ఆలోచిస్తూ అదే విషయాన్ని నందు, గౌతమ్ కి కూడా చెబుతారు. తింగరి అన్న మాట వినగానే నాకు ఏదో తెలియని భావన కలుగుతుంది. అదేంటో నాకు చెప్పండి అని మురారి అంటాడు. అలా చేస్తే నీ ఆలోచనలకు గండి కొట్టినట్టు అవుతుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు నీకు ఏమైనా అయితే నేను, కృష్ణవేణి గారు ఉన్నాం కదా మేము చూసుకుంటాం అని గౌతమ్ భరోసా ఇస్తాడు. ఇక మురారి నిద్ర పోతూ కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు కానీ, ప్రయోజనం లేదని మురారి బాధపడతాడు.

Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights
Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights

మురారి ఉదయం నిద్ర లేచి రెఢీ అయ్యి కిందకి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ అని వాళ్ళ అమ్మని అడుగుతాడు. అందరూ కాఫీ తాగండి మీకు ఒక విషయం చెప్పాలి అని భవాని అంటుంది. ఇక రేవతి అందరికీ కాఫీ ఇస్తుంది. ముకుంద నువ్వు వచ్చి మురారి పక్కన కూర్చో అని భవాని అంటుంది. ఇక భవాని కి రేవతి కాఫీ ఇస్తుంది. తను కాఫీ తాగక అందరూ దేవుడు గదికి రమ్మని పిలుస్తుంది. స్వామి మా అబ్బాయి పెళ్లిని ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నామో మాకంటే నికే బాగా తెలుసు. ఈ పెళ్లి సజావుగా జరిగేలా నువ్వే చేయాలని భవాని వేడుకుంటుంది. మురారిని భవాని పెళ్లి కార్డు చూడమని సంతోషంగా చెబుతుంది. అప్పుడు మురారి పెద్దమ్మ మీరు ఇప్పుడు దేవుడిని ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లిని చేస్తున్నామో అని దేవుడితో అన్నారు అంటే సింపతితో ఈ పెళ్లిని చేస్తున్నారా అని మురారి అడుగుతాడు. ఇక ఆ మాటకు భవాని మౌనంగా ఉండిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights
Krishna Mukunda Murari Today Episode December 05th 2023 Episode 332 Highlights

రేపటి ఎపిసోడ్ లో భవాని పెళ్లి కార్డు తీసుకొని ఇంటికి వస్తుంది కూర్చుండి మేడం అని కృష్ణ అంటుంది. మేము కూర్చోవడానికి రావడం లేదు. వచ్చే శుక్రవారం మా మురారి కి ముకుంద కి పెళ్లి. మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాం అని భవాని అంటుంది. మురారి మాత్రం మనసులో ఏదో తప్పు చేస్తున్నామన్న భావన కలుగుతుంది నాకు అని అనుకుంటాడు. అదేంటో మురారి తెలుసుకుంటాడా.. ఈ పెళ్లిని మురారి ఆపేస్తాడా లేదా అనేది చూడాలి.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N