NewsOrbit
Entertainment News

Madhuranagarilo December 19 2023 Episode 239: పండు అనాధ కాదు ఈ ఇంటి వారసుడే అంటున్న రాదా..

Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights

Madhuranagarilo December 19 2023 Episode 239: రాధా ఏంటి అలాగే నిలబడ్డావ్ పదా లోపలికి వెళ్దాం అని శ్యామ్ రెండు మూడు సార్లు పిలిచినా రాదా పలకదు ఏంటి రాధ ఏంటి అలా ఉన్నావ్ పదా అని శ్యామ్ అంటాడు.తడిచిపోయి ఉన్నారాదని చూసి ఏంటి రాధా తడిసి పోయావు అని వాళ్ళ అత్తయ్య కొంగు తీసి తుడుస్తుంది రాధ తలని. వాన పడకపోయినా ఎలా తడిసారో అని దాక్షాయిని వెటకారంగా అంటుంది. ఇక్కడ వాన పడకపోవచ్చు అత్తయ్య కానీ గుళ్లో పడింది అని శ్యామ్ అంటాడు. అవునా ఇక్కడికి అక్కడికి ఎంత దూరం ఉంది రా వాన పడడానికి అని దాక్షాయిని అంటుంది. అత్తయ్య పక్క వీధిలో పడితేనే మనకు వానరాదు అలాంటిది గుళ్లో పడితే ఇక్కడ పడాలని రూలేమీ లేదు కదా అని శ్యామ్ అంటాడు. రేయ్ ఎప్పుడు తిన్నారో ఏమో వెళ్లి ఫ్రెష్ అప్ అయి రండి అందరం డిన్నర్ చేద్దాం అని  మధుర అంటుంది. కట్ చేస్తే, రాధా శ్యామ్ ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తారు.

Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights
Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights

అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు కానీ రాధ మాత్రం తినకుండా రెస్టారెంట్ లో వాళ్ళ అక్కని శ్యామ్ ని పక్కన గుర్తుకు తెచ్చుకొని అన్నం తినకుండా ఉంటుంది రాదా.ఏంటి రాధా అన్నం తినకుండా అలాగే ఆలోచిస్తున్నావు ఏంటి అని మధుర అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య నాకు ఆకలిగా లేదు నాకు అన్నం తిన బుద్ధి కావట్లేదు అని రాధా అంటుంది. అదేంటమ్మా ఎప్పుడో మధ్యాహ్నం లంచ్ చేసావ్ ఇప్పటిదాకా నీకు ఆకలి కాకపోవడమేంటి అని మధుర అడుగుతుంది. అత్తయ్య గుళ్లో ప్రసాదం పెడితే తిన్నాను అందుకే ఆకలి వేయట్లేదు అని రాదా చెప్పి వెళ్ళిపోతుంది. వదిన రాధా ఆకలి వేయట్లేదని అబద్ధం చెప్పింది కానీ ఎవరి మీద కోపంతోటి అన్నం తినకుండా మానేసింది అని దాక్షాయిని అంటుంది. రాధా ఎవరి మీద అయినా  కోపం వస్తే అన్నం తినకుండా మానేయ దత్తయ్య ఏదైనా సరే తను పేస్ట్ పేస్ట్ గా మాట్లాడుతుంది అని శ్యామ్ అంటాడు. కానీ నాకెందుకో అలాగే అనిపించింది రా శ్యామ్ తను ఎవరి మీద కోపం చూపించాలో తెలియక అన్నం మానేసింది అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights
Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights

అలాంటిదేమీ ఉండదు మీరు అన్నం తినండి వర్షం పడింది కాబట్టి గుడికి భక్తులు ఎవరూ రాకపోవచ్చు అందుకే ప్రసాదం పూజారి ఎక్కువ పెట్టుంటాడు రాధా తిని ఉంటుంది అందుకే ఆకలి వేయట్లేదు మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే, రాధా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పండు వచ్చి అమ్మ ఇకమీదట నుంచి నువ్వు ఎటైనా వెళ్తే నాకు చెప్పే వెళ్లాలి అని పండు అంటాడు. నీకు చెప్పి ఎందుకు వెళ్లాలి నాన్న అని రాదా అడుగుతుంది. అమ్మ నువ్వు గుడికి వెళ్లి ఇంటికి రాకపోయేసరికి నీకు ఏమైందో ఏమో అని నేను ఎంతో భయపడిపోయానో తెలుసా అందుకే నువ్వు ఎటు వెళ్లినా నాకు చెప్పి వెళ్లాలి అని పండు అంటాడు. ఆ బుజ్జి బుజ్జి మాటలు వినగానే రాధకి ఏడుపొచ్చేసి పండుని కౌగిలించుకొని ఏడ్చేస్తుంది. ఐ యాం సారీ నాన్న ఇంకెప్పుడు అలా చేయను నీకు చెప్పే వెళ్తాను అంటుంది రాదా. ఇంతలో శ్యామ్ కూడా అక్కడికి వస్తాడు. అమ్మ గుడ్ నైట్ ఇక నువ్వు పడుకో నేను తాతయ్య దగ్గర పడుకుంటాను అని పండు అంటాడు.

Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights
Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights

పండు ఈరోజు నువ్వు నా దగ్గరే పండుకో నాన్న నాకు భయం వేస్తుంది అని రాధా అంటుంది. అమ్మ నువ్వు ఒక్కదానివే ఉండట్లేదు డాడీ కూడా నీ పక్కనే ఉంటాడు కదా భయం దేనికి అని పండు అంటాడు. ఈరోజు ఒక్క రోజుకి నా దగ్గర పడుకో నాన్న ప్లీజ్ రేపటి నుంచి నువ్వు తాతయ్య వాళ్ళ దగ్గరే పడుకుందువు అని రాధా రిక్వెస్ట్ చేస్తుంది. రేయ్ పండు అమ్మని అంతగనం బ్రతిమిలాడించుకోవాలా తాను అడుగుతుంది కదా పడుకో అని శ్యామ్ అంటాడు. సరే గుడ్ నైట్ డాడీ నువ్వు వెళ్లి పడుకో అని పండు అంటాడు. రాధా పండుని పడుకోబెడుతుంది. శ్యామ్ వెళ్లిపోతూ వెనుకకు తిరిగి చూసి రాదా అంత బాధ పడింది దేనికి గుడిలో పండు కోసం మొక్కుకొని దీపాలు పెట్టింది కదా అందుకే భయపడి పోయి ఉంటుంది అని వెళ్ళిపోతాడు శ్యామ్. కట్ చేస్తే, రేయ్ పండు టైం అవుతుంది ఆగరా నీ అల్లరి ఎక్కువ అవుతుంది కొంచెం అంత తిన్న అన్న అని మధుర బ్రతిమిలాడుతుంది. నాకు వద్దు నాని అంటూ ఇల్లంతా తిరుగుతాడు పండు.

Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights
Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights

పండు నీ వీలు ఇంత ప్రేమగా చూసుకోవడానికి కారణం వీళ్ళ మధ్య ఉన్న రక్తసంబంధం మేన శ్యామ్ సారు కొడుకు అని తెలియకపోయినా పండుని సొంత తండ్రిలా చూసుకుంటున్నాడు  ఇదేనేమో రక్తసంబంధం అని రాదా నానా రకాలుగా ఆలోచిస్తుంది.రేయ్ పండు స్కూల్ కి టైం అవుతుంది రా ఇంక నిన్ను రెడీ చేయాలి ఒక్కచోట నిలబడు అని ధనంజయ్ పండు వెనకాల పరిగెత్తుతాడు. ఇంతలో దాక్షాయిని చలపతి అక్కడికి వచ్చి చూసావా దాక్షాయని అనాధ పిల్లవాడికి అదృష్టం పట్టి ఇంట్లో ఎలా ఆనందంగా ఉన్నాడో అని చలపతి అంటాడు.

Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights
Madhuranagarilo Today Episode December 19 2023 Episode 239 Highlights

బాబాయ్ పండు ఏమైనా అనాధ అనుకుంటున్నావా రోడ్డున పోయే వాడు అనుకుంటున్నావా ఏంటి పండు ఈ ఇంటి వారసుడు అని రాధా అంటుంది  ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. అత్తయ్య మామయ్య అంత ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి ఇంటికి కాబోయే వారసుడు ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి పండు గురించి అని రాదా కోపంతో అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N