NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru March 22 2024 Episode 167: బిర్యానీ కావాలంటున్న పిల్లలు, ఐస్ బిర్యాని తినిపిస్తా అంటున్న చంగయ్య..

Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights

Mamagaru March 22 2024 Episode 167: గంగ నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అని గంగాధర్ బొద్దింకని వెళ్లగొడతాడు. ఏవండీ బొద్దింక పోయిందా అని గంగ అడుగుతుంది. బొద్దింక అయితే పోయింది కానీ వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చి నిన్ను భయపెడుతుందేమో అని గంగాధర్ అంటాడు. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ అన్ని ఇక్కడే ఉన్నాయా అని గంగా గంగాధర్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇంతలో తెల్లవారుతుంది.గంగాధర్ బయటికి వెళ్లి పాలు తెచ్చి వచ్చేసరికిగంగ పడుకొని ఉంటుంది.ఎంత ముద్దుగా నిద్రపోతున్నావు బంగారం అని గంగాధర్ కాఫీ పెడతాడు. గంగ లేచి మీరు ఎందుకు పెడుతున్నారండి అని అడుగుతుంది. నేను పెడితే నువ్వు తాగకూడదా అని గంగాధర్ గంగ కి కాఫీ పోసి ఇస్తాడు. ఇంకో గ్లాసు లేకపోవడంతో ఇద్దరూ ఒకే గ్లాసులో కాఫీ తాగుతారు.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights
Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights

నాన్న మాకు ఆకలి వేస్తుంది అని పిల్లలు అంటారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారా అని పాండురంగ అంటాడు. ఏమి పడితే అవి పెడుతున్నారు మాకు ఈరోజు మటన్ బిర్యానీ కావాలి అని పిల్లలు అంటారు. అయితే నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసు కదా వెళ్లి తాతయ్యని అడగండి అని పాండురంగ అంటాడు. మాకు ఆ విషయం తెలుసులే అని పిల్లలు పదండ్రా తాతయ్యని అడుగుదాం అని అంటారు. ఇంతలో దేవమ్మ వచ్చి ఏం కావాలి పిల్లలు అని అడుగుతుంది. మాకు ఈరోజు మటన్ బిర్యానీ కావాలి నాయనమ్మ అని పిల్లలు అంటారు. అయితే మీ తాతయ్య అని అడగండి అని దేవమ్మా అంటుంది. పదండ్రా తాతయ్యని అడుగుదామని పిల్లలు వెళ్తారు.

Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights
Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights

పద మా నాన్నని పిల్లలు ఎలా ఒప్పిస్తారో చూద్దాం అని పాండురంగ అంటాడు. కట్ చేస్తే, తాతయ్య మాకు ఈరోజు మటన్ బిర్యానీ కావాలి అని పిల్లలు అడుగుతారు. మీకు ఐస్ బిర్యాని తినిపిస్తాను రా అని చ0గయ్య అంటాడు. ఐస్ బిర్యాని అంటే ఏంటి తాతయ్య అది ఎలా ఉంటుంది బాగుంటుందా అని పిల్లలు అంటారు. ఐస్ బిర్యాని అంటే ఏంటి అనుకున్నారా రాత్రి చద్దన్నంలో పెరిగేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తాగితే అదే ఐస్ బిర్యాని అని చెంగయ్య అంటాడు. ఇది చీటింగ్ తాతయ్య మేము ఒప్పుకోం అనే పిల్లలు అంటారు.పిల్లలు మీకేమీ తెలియదు మీరు వెళ్లి ఆడుకోండిఅని చ0గయ్య వాళ్ళని పంపించేస్తాడు. పిల్లలు మటన్ బిర్యానీ అడిగితే నాన్న తెలివిగా ఐస్ బిర్యాని తినిపిస్తానని తప్పించుకున్నాడు మహా మేధావి అని ఆలోచిస్తాడు పాండురంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights
Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights

శ్రీలక్ష్మి పాండురంగ కి ఫోన్ చేస్తుంది. శ్రీలక్ష్మి ఎక్కడున్నావ్ పెళ్లి అయిపోయిందా పెళ్లిలో బిర్యాని పెడతారా అని అడుగుతాడు పాండురంగ. మీరు బట్టలు ఉతకడం అయిపోయిందా అని శ్రీలక్ష్మి అడుగుతుంది. అయిపోయింది శ్రీ లక్ష్మీ కనే నువ్వు ఎప్పుడు వస్తావు అని పాండురంగ అంటాడు. పెళ్లయిపోయిన తర్వాత వస్తాను కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అని శ్రీలక్ష్మి అంటుంది. వాళ్లు ఆడుకుంటున్నారు శ్రీలక్ష్మి అని పాండురంగ అంటాడు.

Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights
Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights

మామగారు ఒక సామెత చెప్పారండి అది మీకు బాగా సూట్ అవుతుంది పని బాగా వచ్చినవాడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయింది అంట అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీ లక్ష్మీ అని పాండురంగ అంటాడు. ఇంతలో దేవమ్మ వచ్చి రేపు పాండురంగ ఈ డబ్బులు తీసుకువెళ్లి మటన్ తీసుకురారా పిల్లలు ఎంతగానో అడిగితే ఆయన కుదరదన్నారు అని దేవమ్మ  అంటుంది. ఈ డబ్బులు నీకెక్కడివమ్మా అని పాండురంగ అంటాడు. రేయ్ పిల్లలు శ్రీలక్ష్మి కి ఫోన్ చేసి చెప్పారంట నాకు ఫోన్ చేసి డబ్బులు తన దగ్గర ఉన్నాయని చెప్పింది అదే నీకు ఇస్తున్నాను వెళ్లి తీసుకురారా అని దేవమ్మ అంటుంది. ఇవి ఇప్పుడు తీసుకెళ్లి మటన్ తీసుకురావాలా మందు తాగాలా అని ఆలోచిస్తాడు పాండురంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights
Mamagaru Today Episode March 22 2024 Episode 167 highlights

గంగ ఎలా ఉన్నారమ్మ మేము మీ ఇంటికి ఒకసారి వచ్చి చూద్దామంటే వాళ్ళు ఏమనుకుంటారో అనిపిస్తుంది అని అంజమ్మ అంటుంది. అమ్మ మేం బాగానే ఉన్నాం రేపు ఇల్లు చూసుకుంటామని చెప్పాను కదా ఇల్లు చూసుకున్న తర్వాత మేమే వస్తాం అని గంగ అంటుంది. సరే గంగా ఇల్లు చూసుకున్న తర్వాత ఇంటికి ఒకసారి రండి అని అంజమ్మ ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకు గంగా మీ అమ్మకి అబద్ధం చెప్పావు అని అంటారా మరి వాళ్లు మనం మహేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నామనుకుంటున్నారండి ఇక్కడికి వచ్చి చూస్తే బాధపడతారు అని గంగ అంటుంది. గంగ నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అని గంగాధర్ అంటాడు. ఏమనిపిస్తుంది అని గంగ అంటుంది. రాత్రి వెళ్ళిపోయినా బొద్దింకలు వచ్చి నిన్ను బెదిరిస్తే అప్పుడు ఏం చేస్తావు అని గంగాధర్ అంటాడు. తన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉందా అని గంగ భయపడుతుంది ..

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu