Samantha: 2021లో స్టార్ హీరోయిన్ సమంత…అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడం తెలిసిందే. ఇండస్ట్రీలో చూడమచ్చటిగా ఉండే ఈ జంట పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకే విడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఎందుకు విడిపోయారు అన్నది ఆ టైంలో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో సమంత పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతం జువాల్కర్ తో ఆమె క్లోజ్ గా ఉంటుందని ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ సమయంలో అక్కినేని అభిమానులు ప్రీతం జువాల్కర్ నీ టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వార్నింగ్ లు కూడా ఇవ్వటం జరిగింది.
ఈ క్రమంలో సమంత జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడం జరిగింది. అయినా గాని రూమర్స్ ఆగటం లేదు తరచూనే వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇటీవల ఇంటర్వ్యూలో ప్రీతమ్.. సమంతాతో రిలేషన్ గురించి స్పందించడం జరిగింది. తెలిసినవారు.. మరి దగ్గరగా ఉన్నవారు బాధల్లో ఉన్న సమయంలో వారికి సపోర్టుగా ఉండటం అనేది కామన్ విషయం. సమంత విషయంలో నేను అదే చేశాను. సమంత ఎప్పటినుంచో నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆమె క్లోజ్ కావటంతోనే ఆమెకు మద్దతుగా ఉన్నాను. అంతేగాని మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉంది. ఈ విషయం నాగచైతన్యకి కూడా తెలుసు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మా మధ్య మంచి రిలేషన్ ఉంది దాన్ని కొందరు తప్పు పట్టడం బాధగా అనిపించింది.
నేను కూడా చాలా ఎగ్ రైస్ నాపై ఏదైనా రూమర్స్ వస్తే తట్టుకునే వ్యక్తిని కాదు. ఒక చెంప మీద పడితే నేను పది డబ్బాలు కొట్టే రకం. అలాంటిది నాపై కామెంట్ చేయడానికి వాళ్ళు ఎవరంటూ ఫైర్ అయ్యాను కానీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుందని కొంతమంది హెచ్చరించారు. ఈ క్రమంలో బాధ బయటకు చెప్పుకోలేదు కానీ లోపల చాలా బాధపడినట్లు… ప్రీతం జువాల్కర్ ఇంటర్వ్యూలో స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా హీరో హీరోయిన్ల కే కాకుండా సినిమాలో కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ధమాకా, యశోద సినిమాలకు కూడా పనిచేసినట్లు ఇంటర్వ్యూలో తెలిపారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!