Mrunal Thakur: టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సీత రామం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది మృణాల్. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి వరుస అవకాశాలు దక్కాయి. ఇక ఈమెకి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ప్రతి సినిమాకి ఒకే చెప్పకుండా మంచి పాత్ర మరియు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. శ్రీ లీలా కి పోటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో కూడా మంచి క్రేజ్ దూసుకుపోతుంది. కానీ ఈమెతో పాటు అడుగుపెట్టిన శ్రీ లీలా మాత్రం ప్రస్తుతం తనకిచ్చిన క్రేజ్ ను వుంచుకోలేకపోయింది.
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఓకే చెప్పేసి తన ఇమేజ్ ని మొత్తం చెడగొట్టుకుంది. గతంలో కృతి శెట్టి సైతం ఇదే బాటలో నడిచింది. అవకాశాలు వచ్చాయి కదా పేరు అదే వస్తుంది అనుకుని తన కెరీర్ ను స్పాయిల్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీ లీలా కూడా ఇదే పనిచేసింది. ఇక మృణాల్ ఠాకూర్ మాత్రం ఆ తప్పు చేయకుండా మంచి కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇటీవలే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటించి మరోసారి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ మరియు పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిని చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనిపిస్తుంది. అంతలాగా క్రేజ్ క్రియేట్ చేశారు మరి. ఈ సినిమా పై అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు ఇటు మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆరబోసే అందాలను మాత్రం ఆపడం లేదు ఈ ముద్దుగుమ్మ.
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో పాటు నడుము వయ్యారాలను చూపిస్తూ పిచ్చెక్కించింది మృణాల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా..” అందమంటే ఇది కదా. నిజంగా మీరు ఏ డ్రెస్ వేసిన సీత లాగానే అనిపిస్తుంది. బాలీవుడ్ లో రూపొందుతున్న రామాయణం మూవీలో మిమ్మల్ని సీతగా తీసుకుంటే బాగుండు. మీకు మరింత క్రేజ్ పెరగడంతో పాటు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏది ఏమైనా మీరు ఈ డ్రెస్ లో సూపర్ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మీ అందాన్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని కోరుకుంటున్నాం. మీ కెరీర్ లో మరో సీత రామం మూవీ రావాలి మేడం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు..!
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!