Paluke Bangaramayenaa October 24 Episode 55: నాయుడు ఇంటికి వచ్చేసరికి సుగుణ రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది. అది చూసి నాయుడు సుగుణా నికు ఏమైంది నిన్ను ఎవరు చంపేశారు ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉన్న నేను ఏమి బాధపడలేదు సుగుణ ఇప్పుడు నువ్వు లేకపోయేసరికి నాకు చెప్పలేనంత బాధ కలుగుతుంది పెళ్లయిన దగ్గర నుంచి నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు నిన్ను చంపాల్సిన అవసరం ఎవరుకుంది సుగుణ అని నాయుడు ఏడుస్తూ ఉంటాడు.

స్వర ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది అమ్మ నిన్ను ఎవరు చంపారు అమ్మ అని ఏడుస్తూ వాళ్ళ నాన్న వంక చూసి స్వర అమ్మ చంపే అంత తప్పు ఏం చేసింది నాన్న చెప్పు అని అంటుంది స్వర. స్వర మీ అమ్మని నేను చంపలేద నేను వచ్చేసరికి చనిపోయి ఉంది అబి సార్ నేను చెప్పేది నిజము నువ్వైనా నమ్ము అని నాయుడు అంటాడు.వైజయంతి అక్కడికి వచ్చేసరికి అబి కూడా అక్కడే ఉంటాడు ఈ పోలీసోడికి అనుమానం రాకుండా యాక్టింగ్ చెయ్యాలి అని వైజయంతి ఏడుస్తూ బావ నీకు కోపం ఉండొచ్చు కానీ సుగుణను ఎందుకు చంపావు చంపే అంత తప్పు ఏం చేసింది బావ నిన్న కోపంలో గొంతు పట్టుకున్నావు ఈరోజు ఏకంగా చంపేశావా అని దొంగ ఏడుపు ఏడుస్తుంది వైజయంతి.

జయంతి నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా నేను సుగుణను ఎందుకు చంపుతాను చెప్పు నేను వచ్చేసరికి చనిపోయి ఉంది నేను మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను ఎవరు నమ్మినా నమ్మకపోయినా స్వర నేను మీ అమ్మని చంపలేదమ్మా ఇది నిజం అని నాయుడు ఏడుస్తాడు. నీ కోపం గురించి నాకు తెలియదా బావ నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టి నేను నమ్ముతాను సరే బయట వాళ్ళు నమ్ముతారా ఈ పోలీసులు నమ్ముతారా అని వైజయంతి అభిషేక్ కి అనుమానం వచ్చేలా మాట్లాడుతూ ఏడుస్తుంది. ఈ ఇంట్లో నాకు ఉన్నది ఒకే ఒక్క దిక్కు మా అమ్మ ఆమెను కూడా లేకుండా చేశావు మా అమ్మ ఏనాడు నీకు ఎదురు చెప్పలేదు కదా మరి ఎందుకు చంపేసావు అని స్వర వాళ్ళ నాన్నని అడుగుతూ ఏడుస్తుంది.

అయ్యో స్వరా నేను ఎలా చెప్పను నేను వచ్చేసరికి మీ అమ్మ చనిపోయిందమ్మ ఇది నిజం నన్ను నమ్మమ్మా అని నాయుడు అంటాడు కట్ చేస్తే విశాల్ ఇంటికి వచ్చి అమ్మానాన్న ఝాన్సీ ని చంపేశాను నన్నే జైల్లో పెట్టాలని చూస్తుందా అందుకే దాన్ని కూడా లేపేసాను అని అంటాడు. రేయ్ ఎన్ని తప్పులు చేస్తావ్ రా ఒక్కదాన్ని తప్పించుకోవడానికి నాన్న తంటలు పడుతుంటే మళ్ళీ ఇంకో హత్య చేశావా ఎలా రా నిన్ను కాపాడుకోవడం అని వాళ్ళ నాన్న అంటాడు. నీకు ఇంకొక బ్యాడ్ న్యూస్ నాన్న ఆ స్వర వాళ్ళ అమ్మ కూడా గుండెపోటుతో చనిపోయింది అని విశాల్ అంటాడు. రేయ్ నిజం చెప్పరా ఆవిడను కూడా నువ్వే చంపావు కదా అని వాళ్ళ అమ్మ అంటుంది. లేదమ్మా నేనెందుకు ఆవిడను చంపుతాను చంపాల్సిన అవసరం నాకేంటి ఆ వైజయంతి చంపేసింది అమ్మ ఇప్పుడు శవం పక్కన కూర్చొని ముసలి కన్నీళ్లు కారుస్తుంది నేను కూడా అక్కడికి వెళ్తున్నాను మీరు మాత్రం రాకండి అక్కడికి వస్తే మీరు దొరికిపోయి నన్ను దొరికేలా చేస్తారు అని విశాల్ వెళ్ళిపోతాడు.

కట్ చేస్తే స్వర వాళ్ళ ఇంటికి అందరూ వస్తారు.నాయుడు ఆ పోలీసోడు ఏంటి నీ వంకే చూస్తున్నాడు అని రంగరాజు అంటాడు. చూడని నేను అన్నిటికి సిద్ధపడ్డాను నేను చంపలేదు కాబట్టి నాకేంటి భయం అని నాయుడు అంటాడు. నువ్వు చంపలేదని అంటే ఎవరు నమ్మరు నాయుడు స్వర తో సహా అందరూ నువ్వే చంపావని నమ్ముతున్నారు పోలీసోళ్ళు ఎంక్వయిరీ పేరుతో నిన్ను ఎంట్రగేషన్ చేస్తారు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు అని రంగరాజు అంటాడు. ఏంట్రాగేషన్ చేస్తే చెయ్యని నేను నిజమే మాట్లాడుతాను సుగుణ ని చంపింది ఎవరో తెలుసుకోవాలి సుగుణ ని ఎవరు చంపారో తెలిస్తే నేనే నా గన్నుతో వాళ్లను షూట్ చేసి పారేస్తాను అని నాయుడు కోపంగా అంటాడు. శవం పక్కనే నిలబడి నాయుడు మాటలు వింటున్న వైజయంతి గుండెలు గుబేల్మంటాయి.

ఇంతలో మీడియా వాళ్ళు వచ్చి మినిస్టర్ గారు బయటికి రావాలి మాకు సమాధానం చెప్పాలి అని అంటారు. నాయుడు వెళ్ళు వాళ్లకి సమాధానం చెప్పు లేదంటే మీడియా వాళ్ళు ఊరుకోరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు అని రంగరాజు అంటాడు.నాయుడు మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతాడు. సార్ ఒక మినిస్టర్ గారింట్లో పట్టపగలు హత్య జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు మీరే చేశారని అందరూ అంటున్నారు పెద్దవాళ్ల ఇళ్లలో హత్యలు బయటపడవు అని అంటారు ఏ గుండెపోటుతోనో పోయిందని మీరు కూడా అలాగే చెప్తారా చెప్పండి సార్ అని మీడియాలో ఒక అతను అంటాడు. వాళ్లు అడిగే ప్రశ్నలకు నాయుడు సమాధానం చెప్పలేక అలాగే నిలబడు చూస్తూ ఉంటాడు. ఇంతలో స్వర అక్కడికి వచ్చి ఇక ఆపుతారా మీ ప్రశ్నలు అని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది