NewsOrbit
Cinema Entertainment News రివ్యూలు సినిమా

Guntur Kaaram Review: పుష్కరకాలం తర్వాత త్రివిక్రమ్ మహేష్ కలయికలో వచ్చిన మూవీ.. “గుంటూరు కారం” సినిమా ఫుల్ రివ్యూ..!!

Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూడో సినిమా “గుంటూరు కారం”. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12వ తారీకు విడుదల అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి సంక్రాంతి పండుగ కలిసి వస్తది. సంక్రాంతి కానుకగా కృష్ణ లేదా మహేష్ నటించిన ఎలాంటి సినిమా విడుదలైన హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఉంది. మరి ఈ సంక్రాంతికి “గుంటూరు కారం” ఆ సెంటిమెంట్ నీ రిపీట్ చేసిందో లేదో తెలుసుకుందాం.

నటినటులు:మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్
దర్శకత్వం:త్రివిక్రమ్
నిర్మాత:సూర్యదేవర రాధా కృష్ణ
సంగీతం:తమన్
సినిమాటోగ్రఫీ:మనోజ్ పరమహంస

పరిచయం:

తెలుగు చలనచిత్ర రంగంలో సూపర్ స్టార్ మహేష్ బాబుని నటన పరంగా వైవిధ్యంగా చూపించిన దర్శకుడు త్రివిక్రమ్. వీళ్ళిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. రెండిటిలో కూడా మ్యాజిక్ జరిగింది. ఇప్పుడు “గుంటూరు కారం” రావటం జరిగింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేయడంతో “గుంటూరు కారం” పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను మహేష్ అందుకున్నాడో లేదో తెలుసుకుందాం.

Mahesh Babu Under Trivikram Direction Guntur Kaaram movie Review

స్టోరీ:

వీర వెంకటరమణ అలియాస్ రమణ (మహేష్ బాబు) చిన్ననాటి నుండి మేనత్త బుజ్జి (ఈశ్వరి రావు) దగ్గర పెరుగుతాడు. రమణ తల్లిదండ్రులు వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరాం) ఇద్దరూ రమణ చిన్న వయసులోనే విడిపోతారు. దీంతో రమణ చిన్ననాటి నుండి గుంటూరులో తన మేనత్త దగ్గర పెరగటం జరుగుద్ది. అయితే రమణ తల్లి వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయశాఖ మంత్రి అవుతది. వసుంధర తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాష్ రాజ్). వెంకటస్వామి జనదళ్ళం అనే పార్టీకి అధ్యక్షుడు. అయితే కూతురు వసుంధరకి సంబంధించి పదవి విషయంలో సొంత పార్టీలో నేతలే వ్యతిరేకంగా మారతారు. ఆమె వ్యక్తిగత విషయాలు బయటపెడతామని.. ఆమెకు రెండో పెళ్లి అయ్యిందని కొడుకు కూడా ఉన్నాడని.. వెంకటస్వామిని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. దీంతో వెంకటస్వామి.. రమణనీ పిలిపించి వసుంధర తన తల్లి కాదని పేపర్ల మీద సంతకాలు పెట్టించే ప్రయత్నాలు చేయడం జరుగుద్ది. కానీ రమణ మాత్రం అందుకు అంగీకరించాడు. దీంతో రమణ చేత ఎలాగైనా సంతకం పెట్టిస్తానని వెంకటస్వామి వకీలు పాణి (మురళి శర్మ) తన కూతురు అమ్ములు (శ్రీ లీల)ని గుంటూరు పంపించడం జరుగుద్ది. ఈ ప్రక్రియలో అమ్ములు రమణతో ప్రేమలో పడతది. మరి ఇంతకీ రమణ సంతకం పెట్టాడా..? చిన్న వయసులోనే కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలేసింది..? రమణ తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు..? కొడుకు విషయంలో వసుంధర చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Mahesh Babu Under Trivikram Direction Guntur Kaaram movie Review

విశ్లేషణ:

“గుంటూరు కారం” ఫుల్ ఫ్యామిలీ సినిమా అని చెప్పవచ్చు. మహేష్ బాబు వన్ మ్యాన్ షో చూపించారు. సినిమాలో ఆయన పాత్ర మాస్ అయినా గాని… రమణ పాత్రల చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామా కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ భావోద్వేగానికి పెద్దపీట వేసి.. సినిమాని నడిపించారు. ప్రధానంగా తల్లీ కొడుకుల మధ్య.. సెంటిమెంట్ స్టోరీ అయినా గాని.. త్రివిక్రమ్ మార్క్ మాటలు కొద్దిగా ఈ సినిమాలో మిస్ అయ్యాయి అని చెప్పవచ్చు. “గుంటూరు కారం” బలహీనమైన రచనతో గురూజీ నిరాశపరిచాడు. సినిమాకి ప్రధాన పాయింటు ఒక సంతకం పెడితే తల్లితో బంధం తెగిపోతుంది అన్న విషయాన్ని మొదటే రివిల్ చేసి దాన్ని సాగదీసే ప్రక్రియ.. థియేటర్ లో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్లు ఉంది. తల్లి కొడుకు అంటే ఆ సెంటిమెంట్ కొద్దిగా చాలా లోతైన భావోద్వేగా సన్నివేశాలు …. రెండు పాత్రల మధ్య మిస్ అయ్యాయి. సినిమా ఫస్ట్ ఆఫ్ కొన్ని ఫైట్లు, హీరోయిన్ లవ్ ట్రాక్.. వెన్నెల కిషోర్ కామెడీతో అలా నడిపించేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎత్తుగడలు.. ప్రేక్షకుడికి ఏమాత్రం అంతగా కనెక్ట్ అయినట్టు ఉండవు. ఈ క్రమంలో మహేష్.. ప్రకాష్ రాజ్ మధ్య గత సినిమాలలో కనిపించే ఆ యొక్క డామినేషన్ వాతావరణం… నువ్వా నేనా అన్న విధంగా ఉండే సీన్స్ పెద్దగా ఏమీ లేవు. జగపతిబాబు, రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, సునీల్ లాంటి భారీ తారాగణం సినిమాలో ఉన్న.. వాళ్లు చేసిన పాత్రల ప్రభావం తెరమీద ఎక్కడా కనిపించదు. మహేష్ మరదలుగా హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకి కూడా పెద్దగా సినిమాలో స్కోప్ లేదు. దీంతో మాటలతో మాయ చేసే త్రివిక్రమ్ దాదాపు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయంతో స్క్రిప్ట్ పై పనిచేసిన “గుంటూరు కారం”లో ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడు అని చెప్పవచ్చు. ఓవరాల్ గా చెప్పుకుంటే మహేష్ తన కెరీర్ మొత్తంలో ఈ సినిమాలో వేసిన డాన్స్ మరే సినిమాలో వేయలేదు.

ప్లస్ పాయింట్స్:

మహేష్ డాన్స్ మరియు నటన
సినిమా సాంగ్స్

మైనస్ పాయింట్స్:

త్రివిక్రమ్ రైటింగ్
స్టోరీ.

ఓవరాల్ గా: త్రివిక్రమ్ మహేష్ కలయికలో అతడు, ఖలేజాలో జరిగిన మ్యాజిక్ “గుంటూరు కారం” లో మిస్సయిందని చెప్పవచ్చు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu