Trinayani november 13 2023 episode 1083: బాబు గారు జరగరానిది ఏదైనా జరిగి తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు పోతే అప్పుడు ఏం చేస్తారు అని నైని అంటుంది.ఓ ఆ విషయమా అని విశాల్ అంటాడు. బాబు గారు అంత తేలిగ్గా అంటారు ఏంటి అని నైని అంటుంది. నైని ఇప్పుడు దాని గురించి మాట్లాడే అంత టైం లేదు ఇక్కడ బ్లూఫిల్ ఉండాలి కదా ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు విశాల్. నేనేం మాట్లాడుతున్నాను మీరేం చెబుతున్నారు మీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడితే మీరు ఏం సమాధానం చెప్తారో నేను వినాలి అని నైని అంటుంది. నైని సరే ఏంటి చెప్పు నీకేం సమాధానం కావాలో చెప్తాను అని విశాల్ అంటాడు. మీకు మళ్లీ మొదటి నుంచి చెప్పాలా లేక నేను చెప్పింది అర్థం కానట్టు మళ్లీ నన్ను అడుగుతున్నారా మీరెందుకు బాబు గారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని నైని అంటుంది.నైని ఇప్పుడు ఆ విషయం గురించి వదిలేయి ఇప్పుడు ఏం కావాలో అడుగు చెప్తాను అని విశాల్ అంటాడు.

పుండరీ నాదం గానవి విషయంలో ఇలాంటి తప్పులు జరగట్లేదు కానీ గాయత్రి ప్రతిసారి తిలోత్తమ అత్తయ్యను గాయపరుస్తుంది మీ అమ్మగారి లాగా ప్రవర్తిస్తే ఎలా బాబు గారు అని నైని అడుగుతుంది. నైని నువ్వు టెన్షన్ పడకుండా కూల్ గా ఉండు ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను గాయత్రి బాధ్యత ఈరోజు నుంచి నాది అని విశాల్ అంటాడు. కట్ చేస్తే ఏం చేస్తున్నావు సుమన అని విక్రాంత్ అంటాడు. ఎవరికి రాని ఆలోచన నాకే వచ్చిందని అందరూ కుళ్ళుకోవాలి ముఖ్యంగా మా అక్క ఎంత ఆస్తి ఉంటే ఏంటి ఇలాంటి ఆలోచన నాకు రాలేదని బాధపడాలి అని సుమన అంటుంది. ఆ సంగతి పక్కన పెట్టు గాని ఉలోచి ని ఎందుకు కింద పడుకోబెడుతున్నావు ఇక్కడ సాయంత్రం అయితే పూజ మొదలవుతుంది కదా అని విక్రాంత్ అంటాడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కొద్దిసేపు ఆగితే మీకే తెలుస్తుంది లక్ష్మీదేవి నీ వల్లే వచ్చిందని మెచ్చుకుంటారు అని సుమన అంటుంది.

నీ మతం నీదే కానీ ఎవ్వరు చెప్పేది వినవు కదా నీ ఇష్టం వచ్చినట్టు తగలడు అంటూ విక్రాంత్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే అందరూ కలిసి హాల్లో పూజ మందిరం ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఎంతైనా ఆ హాసిని అమ్మ నైనీ అమ్మ చాలా అదృష్టవంతులు అని ఎద్దులయ్య అంటాడు. ఎద్దులయ్య ఎందుకు అలా అన్నావు అని పావన మూర్తి అడుగుతాడు. బాబాయ్ మెచ్చుకోకపోయినా నేనేం బాధపడనులే అని హాసిని అంటుంది. అందరూ వచ్చారు కానీ సుమన ఎక్కడ అని విక్రాంత్ అడుగుతాడు. ఈరోజు ధన త్రయోదశి పళ్ళు తోమ కూడా సుమన ఒళ్ళు తోముకుంటుంది అల్లుడు అని పావన మూర్తి అంటాడు. నైని పూజ మొదలు పెడతావా అని విశాల్ అంటాడు. గురువుగారు కూడా వస్తున్నారు బాబు గారు కొద్దిసేపు ఆగుదాము అని నైని అంటుంది. గురువుగారు ఆయన వచ్చి ఏం చేస్తారు అని వల్లభ అంటాడు. నైని ధనత్రయోదశి పూజ రోజు సాధు పొంగవులైన గురువుగారు వచ్చి ఏం చేస్తారు అని తిలోత్తము అంటుంది.

రానివ్వండి అత్తయ్య గారు లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుందో ఆయనే చెప్తారు అని సుమన అంటుంది. చెల్లి నైని నాగులపురం వెళ్లి చెక్కపెట్టె తెచ్చిందని నువ్వు ఒక ఇనప పెట్ట తెచ్చావా అని హాసిని అంటుంది.నువ్వు మాదాపూర్ వెళ్ళావా సుమనమ్మ అని పావన మూర్తి అడుగుతాడు. ఈ పెట్టెలో ఏముందో మీకు చూపెడతాను కానీ కొద్దిసేపు ఆగండి అని సుమన అంటుంది.ఇంతలో గురువుగారు వచ్చి పూజకు అన్నీ సిద్ధమైనట్టే నైని అని అడుగుతాడు. వీళ్లు లక్ష్మీదేవి కోసమని బుడిబుడి అడుగులు వేస్తే బూడిద పూసుకున్న మీరు వచ్చారేంటి స్వామి అని తిలోత్తమా అంటుంది. రూపాయ కూడా ధనం లేని ఈ స్వామీజీ గారు ఎందుకు వచ్చారు అని సుమన అంటుంది. ధనం ఉన్న సరే అందరూ దేవుడి వైపే నడవాలి అని స్వామీజీ అంటాడు. మనం అజ్ఞానంలో పడి భగవంతుడి వైపు అడుగు వేయట్లేదు ఇంకా డబ్బు పొగుడుతూనే కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాము కానీ స్వామీజీ జ్ఞానం కలిగిన వారు కాబట్టి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయన ధనవంతుడయ్యాడు ధనవంతుడు అంటే డబ్బు ఉండడమే కాదు జ్ఞానం అనే సంపద గురువుగారికి ఉంది దాని ముందు ఎంత డబ్బైనా బలాదూరే అని విశాల్ అంటాడు సుమన గురువుగారిని అవమానిస్తే కళ్ళు పోతాయి అని నైని అంటుంది.

లలితా దేవి లక్ష్మీదేవి లా వస్తుంది చూడండి అని స్వామీజీ అంటాడు. పెద్ద అత్తయ్య మీరా బాగున్నారా అని నైని అడుగుతుంది. అందరూ బాగున్నారా విశాల్ అని లలిత అడుగుతుంది. మేము బాగానే ఉన్నాం పెద్దమ్మ నువ్వు బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాము అని విశాల్ అంటాడు. పెద్దక్క లక్ష్మీదేవిలా వచ్చింది కానీ ఏంటి చేతులు ఏవో పట్టుకొని వచ్చింది అని తిలోత్తమా అంటుంది. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయాయా తిలోత్తమా వల్లభ నేనేం తెచ్చానో చెప్పు అని వల్లభ వంకర చూస్తూ అంటుంది లలిత.ఏముంది పెద్దమ్మ నీ చేతిలో చీపురు కట్ట ఉప్పు అని వల్లభా అంటాడు. చీపిరి కట్ట ఎవరింట్లోనైనా ఉండాల్సిందే ఇక ఉప్పు అంటారా అది లేకపోతే వంట ఎలా చేస్తారు లక్ష్మీదేవికి అవి రెండు ప్రతిరూపాలు అని నైని అంటుంది. బాగా చెప్పావు నైని పేదవాడి ఇంట్లోనేనా పెద్ద వాళ్ళ ఇంట్లోనైనా ఏవి ఉన్నా లేకపోయినా ఉండవలసింది చీపిరి ఉప్పు అని లలితా దేవి అంటుంది.చాలా బాగా చెప్పావు పెద్దమ్మ అజ్ఞానులకు ఆ విషయం అర్థం కాదులే పెద్దమ్మ అని విశాల్ అంటాడు. హాసిని ఈ ఇంటికి పెద్ద కోడలి కాబట్టి నువ్వు ఈ చీపురు తీసుకొని ఇల్లునంతా శుభ్రంగా ఉంచుకో, నైని నువ్వు ఈ ఉప్పుని తీసుకొని అన్నపూర్ణ దేవిలా అందరికీ వంట చేసి పెట్టు అని వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరికీ ఇస్తుంది. మాటలతోటే పొద్దుపోతుంది పూజ కార్యక్రమం చేసేది ఏమైనా ఉందా అని తిలోత్తము అంటుంది.

విశాల్ విక్రాంత్ మీరు ఏవేవి వస్తువులు తెచ్చారు అమ్మవారి దగ్గర పెట్టండి అని స్వామీజీ అంటాడు. ఇదిగో హాసిని ఇవి మా అమ్మ కోసం తెచ్చాను నువ్వు తీసుకోకు అని వల్లభా అంటాడు. మీ అమ్మకు తే కపోతే నాకెప్పుడూ తెచ్చారండి నాకేం అక్కర్లేదు మీరిచ్చిన నేను తీసుకోను అని హాసిని అంటుంది. అందరూ అక్కడ పెట్టారు కానీ చిట్టి మాత ఏం తెచ్చిందో చూపెట్టనే లేదు అని ఎద్దులయ్య అంటాడు. గుండె బిగ్గరగా పట్టుకొని చూడండి అని సుమన అంటుంది. భయపడే వస్తువు ఎందుకు తెచ్చావమ్మా అని పావని మూర్తి అంటాడు బాబాయ్ దడుచుకునేది ఏమీ కాదు కళ్ళు పెద్దగా చేసుకుని చూడండి అవి చూసిన తరువాత నాకెందుకు ఈ ఆలోచన రాలేదని లో లోపల కుమ్ములుకుంటారు చూడండి అని సుమన పెట్టాను ఓపెన్ చేస్తుంది. సుమన డబ్బులు తెచ్చింది ఏంటి అని అందరూ షాక్ అవుతారు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది