NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani November 30 2023 Episode1098: తిలోత్తమ తీసుకు వచ్చిన పాపని, గాయత్రీ దేవి కాదని కనిపెట్టిన నైని…

Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights

Trinayani November 30 2023 Episode1098: అమ్మ బుల్లి పెద్దమ్మని తీసుకొద్దాం పద అని వల్లభ అంటాడు. నేను కూడా వస్తాను అమ్మ అని విక్రాంత్ అంటాడు. ఎందుకు పిల్లల్ని మార్చడానికా అని తిలోత్తమ అంటుంది. అలా అడగండి అత్తయ్య అప్పుడైనా బుద్ధి వచ్చి ఉలోచిని  కన్న కూతురని ఒప్పుకుంటాడు అని సుమన అంటుంది. తిలోత్తమ వల్లభ గాయత్రిని తీసుకురావడానికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే, ఏం ఆలోచిస్తున్నావ్ విశాల్ అని హాసిని అడుగుతుంది. తెలియనట్టు అడుగుతావేంటి వదిన గాయత్రి అమ్మని తిలోత్తమ అమ్మ తీసుకొస్తానని చెప్పింది కదా ఎవరిని తీసుకొస్తుందో ఏమో అని విశాల్ అంటాడు. అసలు ఎందుకు విశాల్ ఆవిడకి ఆ ఆలోచన వచ్చింది, గాయత్రీ మన దగ్గరే ఉందని ఆవిడకు నిజం చెప్పలేము చెపితే ఆపద తలపెడుతుంది ఇప్పుడు ఎలా అని హాసిని అంటుంది. ఇంతలో నైని వచ్చి ఏంటి పాప అని మాట్లాడుతున్నారు గాయత్రీ నా దగ్గరే ఉంది కదా అని అంటుంది. గాయత్రీ గురించి కాదు చెప్పేది తిలోత్తమ అత్తమ్మ తెస్తానన్న పాప గురించి మాట్లాడుకుంటున్నాం అని హాసిని అంటుంది. అవును అత్తయ్య వాళ్ళు ఆ పని మీదే బయటికి వెళ్లారు కదా అని నైని అంటుంది.

Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights
Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights

అవును ఏ కూరగాయలు పుచ్చిపోయిన వంకాయలు తీసుకువస్తారు అని హాసిని అంటుంది. వదిన నువ్వు కొద్దిసేపు ఆగు మనం ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న పాప మనకు దొరకలేదు అంత ఈజీగా అమ్మకి ఎలా దొరుకుతుంది అని విశాల్ అంటాడు. తీసుకువస్తానని చెప్పింది కదా చూద్దాం బాబు గారు అని నైని అంటుంది. కట్ చేస్తే, అందరూ పాపని ఎప్పుడు తీసుకువస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. అందరము ఉన్నాము కానీ ఎద్దులయ్య మాత్రం కనపడట్లేదేంటి అని హాసిని అంటుంది. తన పని ఏదో చూసుకోవడానికి బయటకి వెళ్ళాడు లే అని నైని అంటుంది. అవును అమ్మ ఎవరిని తీసుకువస్తుంది అని విశాల్ అంటాడు. తీసుకువచ్చే పాప గాయత్రి అని ఎలా తెలుస్తుంది అని విక్రాంత్ అంటాడు. అత్తయ్య బల్ల గుద్ది చెప్పింది కదా డిఎన్ఏ టెస్ట్ చేసిన గాయత్రి అని తెలిసిపోతుందని సుమన అంటుంది. బల్ల గుద్ది చెప్పడం ఎందుకు సోఫాను గుద్దామని చేతికి కట్టు కడదాము అని హాసిని అంటుంది. అబ్బా ముందు నీ జోకులు ఆపమ్మ ఇంత సీరియస్ మేటర్ లో కూడా ఏంటి ఆ మాటలు అని పావన మూర్తి అంటాడు.నన్ను కన్న తల్లి నా చేతిలోనే ఉన్న చెప్పలేని పరిస్థితి నాది అని విశాల్ మనసులో అనుకుంటా.

Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights
Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights

వెళ్లారు కదా పాపనైతే తీసుకురానివ్వండి అని విశాలాక్షి అంటుంది. ఇంతలో వల్లభ వస్తాడు. వచ్చాడు తుపాకీ రాముడు అని హాసిని అంటుంది. నా చేతిలో తుపాకీ ఉంటే నిన్ను సూట్ చేసి పారేసేవన్ని నీ జోకులు వినలేక చస్తున్నాను అని వల్లభ అంటాడు. సరే బావగారు మీరు వచ్చారు అత్తయ్య ఎక్కడ అని సుమన అడుగుతుంది. గాయత్రీ పెద్దమ్మను తీసుకువస్తుంది కదా మామూలుగా ఎలా వస్తుంది అని వల్లభ అంటాడు. ఏమైనా బ్యాండ్ మేళం తెప్పించమంటారా అని హాసిని అంటుoది. ముందు నువ్వు నోరు ముయ్యి  చూడు పెద్దమ్మ ఎంట్రీ ఇస్తుంది అని వల్లభ అంటాడు. తినోత్తమ గాయత్రి పాపని ఎత్తుకొని వస్తుంది. అందరూ ఒక్కసారిగా నిచ్చేస్టులే నిలబడి చూస్తూ ఉంటారు. ఏంటి నైని అలా నిలబడి చూస్తున్నావు నీ కన్నా కూతుర్ని ఎత్తుకోమని వేరొకలు చెప్పాలా అని తిలోత్తమ అంటుంది. కన్న కూతుర్ని చూసిన ఆనందంలో ఏం చేయాలో తెలియక అలా నిలబడి చూస్తుంది అమ్మ అని విశాలాక్షి అంటుంది. నైని గాయత్రీ ని ఎత్తుకుంటుంది. అదేంటి అక్క ఎవరో పరాగి పిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నావు ఇన్నాళ్లు దూరమైన కూతుర్ని ఎత్తుకుంటే ఎమోషన్ అయిపోయి కన్నీళ్లు కారుస్తావ్ అనుకున్నాను అని సుమన అంటుంది.

Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights
Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights

చిన్నపిల్లలుని ఎవరో అని ఎందుకు అనుకుంటాను సుమన పసిపిల్లలు దేవుడితో సమానం అని నైని అంటుంది. చాలా థాంక్స్ అమ్మ ఇన్నాళ్లుగా మేము ఎంతో శ్రమపడి వెతికాను కానీ అమ్మ మాకు దొరకలేదు ఎంతో శ్రమపడి మా కోసం నువ్వు వెతికి తెచ్చావు అని విశాల్ అంటాడు. అనాధ పిల్లలకే పాతిక కోట్లు రాశావు కదా నీ కన్న కూతురు అయినా గాయత్రీ కి ఏమిస్తావ్ అక్క అని సుమన అడుగుతుంది.నైనికి ఆ విషయం తెలుసు లే సుమన తనేమీ ఊరికే వదిలిపెట్టదు అని తిలోత్తమ అంటుంది. నేనైతే ఉన్న ఆస్తినంతా ఇచ్చేసేదాన్ని అని సుమన అంటుంది. చెప్పండి అత్తయ్య మీకు ఏం కావాలి ఆస్తి కావాలా ఎక్కడైనా స్థలం కావాలా డబ్బు కావాలా అని నైని అడుగుతుంది. అమ్మ నీతో పాటు నేను కూడా శ్రమపడితిరిగాను పెద్ద మరదలు ఇచ్చే దాంట్లో నాకు సగం వాటా వస్తుంది అని వల్లభ అంటాడు. ఎటు తిరిగి డబ్బుకే మీరు ముడి పెడతారని నాకు తెలుసు బ్రో అని విక్రాంత్ అంటాడు. రేయ్ కన్న కూతురు తిరిగి వచ్చిందన్న ఆనందంలో నైని  ఏదైనా ఇస్తుందిలే దానికి ఎందుకురా డబ్బు అడుగుతున్నట్టు అంటావు అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights
Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights

కట్ చేస్తే, త్రిలోత్తమకి పాపని ఇచ్చిన ఆవిడ డబ్బులు లెక్కపెట్టుకుంటూ అక్కడ ఉంటుంది. డబ్బు లెక్కపెట్టుకుంటున్నావా మాత నిన్ను అదే డబ్బుతో ఈ ఇంట్లోకి పరిగెత్తలా చేస్తాను అని ఎద్దులయ్య ఎద్దుగా మారి పోతాడు. ఇంట్లో నా మనవరాలు పెరుగుతే నేను ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తారు అని ఆవిడ అనుకుంటుంది. కట్ చేస్తే, అత్తయ్య చేతులు చాపండి అని నైనా అంటుంది.  అమ్మ పెద్ద మరదలు చేతులు చాపు అంటుంది అంటే చేతులు ఏమైనా పెడుతుందేమో అని వల్లభ అంటాడు. అత్తయ్య రెండు చేతులు అవసరం లేదు ఒక చేయి చాపండి చాలు అని నైని అంటుంది. అమ్మ ఏమో అనుకున్నాను కానీ నువ్వు తెలివిగల దానివే అని విశాలాక్షి అంటుoది. అత్తయ్య ఒకటే చేయి చాపు అన్నది అంటే అక్క చెక్కు చేతిలో పెడుతుందేమో అని సుమన అంటుంది. బేస్ బేస్ మంచి ఆలోచన చేశావు నైని అని డమ్మక అంటుంది.

Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights
Trinayani Today Episode November 30 2023 Episode1098 Highlights

లేదు చెల్లి బొచ్చ చేతిలో పెడుతుందేమో అడుక్కోమని అని హాసిని అంటుంది. హాసిని అమ్మ నువ్వు కాసేపు ఊరుకో అమ్మ అని పావని మూర్తి అంటాడు. నైని గాయత్రీ పాప కుడి చేయిని తిలోత్తమ కుడిచెయ్యిలో పెడుతుంది. ఇదేంటి అత్తయ్య నీ గుడి చేయి గాయత్రీ కుడి చెయ్యి తగిలితే మంటలు రేగుతాయని నీకు ఆ మాత్రం తెలియదా నువ్వు ఎవరినొ తెచ్చి గాయత్రి అంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు అని నైని అంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని తిలోత్తమ అంటుంది. మనకు అఖండ స్వామి చెప్పినట్టే వీళ్లకు కూడా చెప్పాడేమో అమ్మ అని వల్లభ అంటాడు. నాకు మన స్వామీజీ చెప్పాడు అని నైని అంటుంది. ఇంతలో ఎద్దులయ్య ఆ పాపని తిలోత్తమ కి ఇచ్చిన ఆవిడని తరుముతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N