సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు మీద పడినా గాని సినిమాలు చేయడంలో ఎక్కడ తగ్గటం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించగా చివరి నిమిషంలో… ఆ నిర్ణయం నుండి రజిని తప్పుకోవడం జరిగింది. మళ్లీ సినిమాలతో బిజీగా ఉంటున్నా రజిని ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో “జైలర్” అనే సినిమా చేస్తూ ఉన్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. ఈ సినిమాలో రజిని సరసన హీరోయిన్ పాత్ర కోసం మొదట ఐశ్వర్యరాయ్ నీ తీసుకోవడానికి ప్రయత్నాలు చేశారు.
కానీ అనుకోని కారణాలవల్ల.. ఐశ్వర్యరాయ్ పేరు పక్కన పెట్టేయడం జరిగింది. ఈ క్రమంలో రమ్యకృష్ణ పేరు తెరపైకి రావడం జరిగింది. రమ్యకృష్ణ రజినీకాంత్ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి. వీటిలో 1999లో వచ్చిన నరసింహ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. రమ్యకృష్ణ నెగిటివ్ క్యారెక్టర్ సినిమాకి ఎంతగానో ప్లస్ అయింది. ఇప్పుడు అదే తరహాలో “జైలర్” సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఉండబోతున్నట్లు… సమాచారం. కొద్ది సంవత్సరాల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా రమ్యకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అవకాశం అందుకోవటం జరిగింది అంట. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో రమ్యకృష్ణ జాయింట్ కానున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. రమ్యకృష్ణ హీరోయిన్ అని ప్రకటించటంతో “జైలర్” పై అంచనాలు ఇప్పుడు మరింతగా పెట్టేసుకున్నారు అభిమానులు.