Thinking: చాలా మంది ఏదో ఒక విషయాన్ని పట్టుకుని పది రకాలు గా పదే పదే నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించడం వల్ల చేయవలిసిన పనులు అన్ని పెండింగ్ లో ఉండిపోతాయి. అలాగే ఆనందంగా కూడా ఉండలేరు. కాబట్టి అతిగా ఆలోచించడం మానుకోవడం ముఖ్యం. మీరు కూడా అతిగా ఆలోచించి ఇబ్బంది పడుతుంటే,ఈ పద్ధతిని అనుసరించి దాని నుండి బయట పడి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండండి. మీరు ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి సందర్భంలో అలా జరుగుతుందో గుర్తిస్తేఈ సారి వెంటనే మీరు దాన్ని అదుపు చేయడానికి వీలు ఉంటుంది. దీని వల్ల మీరు ఆలోచనల్ని డైవర్ట్ చేసి దీని నుండి బయట పడవచ్చు.
ఏదైనా అతిగా ఆలోచించడం కంటే దాన్ని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. ఒకవేళ కనుక మీరు ఆ సమస్యలు పరిష్కరించ లేరు అని అనుకుంటే ఆలోచనా విధానాన్ని మార్చుకోండి.మీ నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేస్తే ఎక్కువ ఆలోచించడం నుండి తేలికగా బయట పడవచ్చు. మనిషి అన్నాక ఆలోచనలు వస్తూ ఉండటం చాలా సహజం. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీరు వాటినుండి గట్టెక్కడానికి ప్రయత్నం చేయండి.అలాగే నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు దాని స్థానంలో పాజిటివ్ థింకింగ్ కి స్థానం ఇవ్వండి.
ప్రతి సారి ఒక నెగిటివ్ ఆలోచన రాగానే, వెంటనే ఆ విషయం పాజిటివ్ గా అయితే ఏమి ఆలోచిస్తారో అదే ఆలోచించండి. అలా, నెగిటివ్ ఆలోచన ఉండిపోకుండా పోరాటం , ఒక పాజిటివ్ ఆలోచన ని తీసుకురండి.అప్పుడు మీ చుట్టూ ఎంతో మార్పు కనిపిస్తుంది.మీరు మీ మైండ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అతిగా ఆలోచించకుండా పుస్తకాల ద్వారా లేదా ఇతర వీడియోలు లేదా ఆప్స్ నుంచి మైండ్ ఫుల్ స్కిల్స్ ని ట్రై చేయండి. ఇలాంటివి కనుక మీరు చేస్తే దీని నుంచి సులభంగా బయటపడవచ్చు.
.