హెల్త్

ఆపిల్ పండును కొంపదీసి తొక్కతో సహా తినేస్తున్నారా.. ఏంటి..?

Share

యాపిల్ పండు గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. ఎర్రగా నోరు ఉరిస్తూ కనిపించే ఆపిల్ పండులో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి. ఆపిల్ పండు తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. రోజుకో యాపిల్ పండు. తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళవలిసిన పని లేదు అని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.ఎందుకంటే ఆపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. యాపిల్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఆపిల్ లో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్త కణాలని,నాడీ వ్యవస్థ పెరుగుదలకి ఎంతగానో దోహద పడుతుంది. ఇంతే కాకుండా ఆపిల్ లో ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల రోగాలు రాకుండా సహాయ పడుతుంది. 

ఆపిల్ పండు తింటే కలిగే ఉపయోగాలు :ఆహారం తీసుకునే ముందు ఆపిల్ ని తిన్నట్లయితే కడుపు నిండిన భావన వస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు ఎందుకంటే ఆపిల్ లో తక్కువ కెలోరీలు మరియు ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల బరువు తగ్గడానికి దోహద పడుతుంది.అయితే యాపిల్ పండును తొక్కతో తినాలా?లేక తొక్క తీసేసి తినాలా అని మీలో చాలా మందికి ఒక అనుమానం ఉండే ఉంటుంది.నిజానికి యాపిల్ పండును తొక్కతో తింటెనే ఆరోగ్యానికి మంచిది. యాపిల్ తొక్కలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా,రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.ఐతే ప్రస్తుత పరిస్థితులలో మనం తినే అన్ని ఆహార పదార్ధాలు కల్తీ చేయబడుతున్నాయి.

ఆపిల్ పండును తొక్కతో సహ తినవచ్చా..?రసాయనాలు ఉపయోగించి పండ్లను, కూరగాయలను పండిస్తున్నారు. అలాగే ఈ యాపిల్ సాగు సమయంలో కూడా వివిధ రకాల రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు..అవి అన్ని కూడా యాపిల్ తొక్కకు అంటుకుని ఉంటాయి.అలాంటప్పుడు ఆపిల్ పండును నేరుగా తింటే ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాగే మరికొందరు వ్యాపారులు యాపిల్స్ నిగనిగ లాడుతూ కనిపించడానికి, మంచి రంగుతో ఉండడానికి రంగులతో పూత వేస్తారు అలాంటప్పుడు తొక్కతో నేరుగా యాపిల్‌ పండు తినడం మంచిది. కాదు.తొక్కతో కలిపి తింటే ఈ విష రసాయనాలు శరీరంలోకి చేరుతాయి.ఆపిల్‌ను తినే ముందు గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి, శుభ్రంగా కడిగిన తర్వాత తొక్కతో సహా తింటేనే ఆరోగ్యానికి మంచిది


Share

Related posts

Growth : ఒక ఇల్లు సిరి సంపదలు ,సుఖ సంతోషాలతో  తుల తూగులంటే  ఈ అంశాలు మీద దృష్టి పెట్టవలిసిందే !!

siddhu

Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి..!? ఎలా చేయాలి..!?

bharani jella

తులసి తో ఇన్ని బెనిఫిట్ లు ఉన్నాయి అంటే నమ్మలేరు మీరు!  

Kumar