హెల్త్

బీట్ రూట్ వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

Share

బీట్ రూట్ గురించి మన అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే బీట్ రూట్ తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేయలంటే బీట్ రూట్ తప్పనిసరిగా తినాలి. అలాగే బీట్ రూట్ తినడం వలన చాలా రకాల అనారోగ్యసమస్యలు రావు.ఎందుకంటే బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A,విటమిన్ B6,ఐరన్ వంటి ఎన్నో పోషకాలతో పాటుగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో మూలకాలు ఉన్నాయి..ఇవే కాకుండా బీట్ రూట్ తినడం వలన మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

బీట్ రూట్ ఉపయోగాలు :

శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ బీట్ రూట్స్ లో పుష్కలంగా ఉంటాయి. అలాగే బరువు తగ్గాలని భావించేవారికి బీట్ రూట్ మంచి ఎంపిక అనే చెప్పాలి. ఎందుకంటే బీట్రూట్ లో 88% నీరు కలిగి ఉంటుంది అలాగే కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి, అందువల్ల బీట్ రూట్ తింటే బరువు తగ్గించుకోవచ్చు.అలాగే బీట్ రూట్ లో ఫైబర్స్ కూడా అధికంగా ఉంటాయి.అందువల్ల, జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతగా జరుగుతుంది.మరియు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.బరువు తగ్గాలనుకునే వారు రోజు బీట్ రూట్ ను తినాలి.

కాలేయ ఆరోగ్యానికి బీట్ రూట్ బెస్ట్ ఆప్షన్ :బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్ బీటైన్ కాలేయంలోని కొవ్వు నిల్వలను నిరోధించడానికి లేదా తగ్గించడానికి సహాయపడుతుంది. బీట్ రూట్ మధుమేహ వ్యాధి గ్రస్థులు కూడా తింటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది వారిలో రక్త గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.బీట్రూట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది
బీట్రూట్ యొక్క అధిక యాంటీ ఆక్సిడెంట్ శాతం క్యాన్సర్ నివారణకు సమర్థవంతంగా పని చేస్తుంది


Share

Related posts

Corona: క‌రోనా వ్యాక్సిన్ క‌ష్టాలు ఇక ఉండ‌వు…ఏం జ‌రుగుతుందో తెలుసా?

sridhar

తెల్లారిన దగ్గర నుంచీ మాటిమాటికీ కూల్ డ్రింక్స్ తాగేవాడు చివరికి ఇలా అయ్యింది !

Kumar

డయాబెటిస్ రోగులకు గాయమైతే ఏమవుతుందో తెలుసా..?

Ram