జామకాయ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఒకప్పుడు జామకాయను చాలా తేలిగ్గా తీసుకునే వారు.కానీ జామకాయలో ఉండే పోషక విలువలు గురించి తెలిసిన వారు ఎవరు జామకాయను తినకుండా మాత్రం ఉండరు.జామకాయ చాలా చౌకగా లభించిన అందులో ఉండే పోషకాలు అధికం. అనే చెప్పాలి.జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం అధిక సంఖ్యలో ఉంటాయి.ముఖ్యంగా జామకాయలో క్యాలరీలు తక్కువగాను,పీచు పదార్ధం చాలా ఎక్కువగాను ఉంటుంది.అంతేకాకుండా నీటిలో కరిగే బి, విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ విటమిన్ ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. జామకాయలో విటమిన్ సి కూడా ఉంటుంది.. ఇవే కాకుండా జామకాయ తినడం వలన మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
షుగర్ వ్యాధిగ్రస్తులకు:
చక్కెర వ్యాధిగ్రస్తులకు జామకాయ ఒక గొప్ప వరం అనే చెప్పాలి. షుగర్ ఉన్నవాళ్లు తమ పళ్ల జాబితాలో జామ కాయను చేర్చుకోవాలి.బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం విశేషం.
బరువు తగ్గడానికి:
ఈ కాలంలో చాలా మంది అధికబరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు. ప్రతిరోజు జామపండును తింటే త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. అందుకే స్తులకాయం సమస్య ఉన్నవారు జామకాయను తినాలి. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే ” పెక్టిన్” జామ కాయలో ఎక్కువగా లభిస్తుంది .
క్యాన్సర్ నివారణ :
జామకాయ ఒక శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా పనిచేస్తుంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ రాకుండా నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది.
దంతాల ఆరోగ్యంలో:
పిచ్చి పళ్ళు ఉన్నవారు, దంతాలు, చిగుళ్ళు సమస్య ఉన్నవారు జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గుతాయి. అలాగే చిగుళ్ల వాపులు కూడా క్రమంగా తగ్గించుకోవచ్చును. జామ ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడడంతో పాటుగా దంతాలు ధృడంగా మారతాయి..