ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సేవించే పానీయాల్లో కాఫీకి ఒక ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి.ఎందుకంటే కాఫీ టేస్ట్ అలా ఉంటుంది మరి. అలసట పొందిన శరీరానికి, మైండ్ కి కొత్త రిఫ్రెష్ ఇచ్చే పానీయం కాఫీ అనే చెప్పాలి. ఒక్క సిప్ టేస్ట్ చేస్తే చాలు కాఫీకి బానిసలు అయిపోతారు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతు ఉంటారు.చాలా మంది కాఫీతోనే వాళ్ళ రోజును ప్రారంభిస్తుంటారు.
కాఫీతో బరువు తగ్గవచ్చా?
చక్కటి ఆరోమా, రుచి, సువాసన కలిగిన కాఫీని తాగడం వలన బరువు కూడా తగ్గవచ్చు అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కానీ ఇది నిజమండోయ్. కాఫీనీ కనుక మేము చెప్పిన విధంగా తీసుకుంటే ఎలాంటి పొట్ట అయినా ఇట్టే మాయం అవుతుంది. మరి అదెలానో తెలుసుకుందాం.
వెయిట్ లాస్ కాఫీ ఎలా చేయాలంటే..?
ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక కప్పు బాగా మరిగించిన నీళ్లను పోసి బాగా కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. అన్ని బాగా కలిసిన తరువాత ఆ కాఫీ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి గోరువెచ్చగా ఉన్నపుడే తాగాలి. పైన చెప్పిన పద్దతిలో కాఫీ తాగితే పొట్ట వద్ద పేరుకు పోయిన కొవ్వు మొత్తం కరిగి పోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు. నుండే మొదలుపెట్టండి..