NewsOrbit
హెల్త్

వీటిని తింటే మీ జుట్టు పదిలం..!

వీటిని తింటే మీ జుట్టు పదిలం..!

జుట్టు అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు మరి ఈ రోజుల్లో  జుట్టు రాలె సమస్య ఎక్కువగా ఉంది . పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. కొన్ని ఆహార పదార్ధాల తో కొన్ని జాగ్రత్తలతో ఆ  సమస్యని అరికట్ట వచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.

వీటిని తింటే మీ జుట్టు పదిలం..!

వేడి నీరు తాగడం వల్ల జుట్టుకణాల పని తీరు మెరుగవడంతో పాటు.. జుట్టు కుదుళ పెరుగుదలను వేగవంతం చేస్తుంది.నీరు చుండ్రుకువ్యతిరేకంగా పోరాడటానికి మెరిసే జుట్టు పొందడానికి ఉపయోగపడుతుంది. నీరు తాగడం వలన జుట్టు మొదల్లో ఉన్న నరాల చివర్లను శక్తివంతం చేసి వాటిని చురుకుగా,ఆరోగ్యంగా  ఉంచుతుంది.  జుట్టు పెరుగుదలకు కావలిసిన ప్రోటీన్ కోడిగుడ్డు నుంచి లభిస్తుంది. ప్రోటీన్ తీసుకుంటే  జుట్టు రాలే  సమస్యను అరికట్టవచ్చు . గుడ్డు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

వంకాయలో ఐరన్, విటమిన్ ఎ మరియు సి వంటి పోషకాలు ఉంటాయి.ఈ పోషకాలు జుట్టు ను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.బచ్చలికూర జుట్టు పోషణకు చాలా మంచిది.పాలకూరలో ఐరన్, విటమిన్ A, విటమిన్ C మరియు ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. జుట్టు రాలడానికి ఐరన్ లోపం ముఖ్య కారణం. ఆరోగ్యకరమైన మాడు మరియు కాంతులీనే కురులు పొందడానికి పాలకూర తోడ్పడుతుంది.. చేపలు తినడం వల్ల కూడా జట్టు ఊడే సమస్య తగ్గుతుంది.  జుట్టు పెరుగదలకు సహాయపడుంది.

\చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇవి జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి .  ఇందులోపాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు  ఐరన్ జింక్, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, మరియు వంటి పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ఎక్కువ చేస్తుంది .జుట్టు రాలడాన్ని తగ్గించడానికి క్యారెట్లు చాలా మంచివి. ఇవి బలమైన ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరం.

ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు రాలడం ఆశ్చర్యపడేంతగా తగ్గుతుంది.కాలీఫ్లవర్‌లో విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, కాల్షియం, జింక్ మరియు ఐరన్ ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఇవన్నీ ఎంతగానో ఉపయోగపడతాయి. బాదంపప్పులో పుష్కలంగా ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడే ముఖ్యమైన ఆహారాలలో ఇది కూడాఒకటి. బాదం లోని  మెగ్నీషియం జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తు  జుట్టు చిట్లిపోకుండా రక్షణ ఇస్తుంది.

విటమిన్ C జట్టు పేలుసుగా మారకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నారింజ పండ్ల కన్నా జామపండ్లలో విటమిన్ C అధికం. పండ్ల లో లాగ ఆకులలోకూడా విటమిన్  C మరియుB లు ఉంటాయి. ఇవి కొల్లాజన్ పనితీరును మెరుగుపరచి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.ఆహారం లో ఇలాంటి జాగ్రత్త తీసుకుని వారానికి మూడు నుండి నాలుగు సార్లు గోరు వెచ్చని నూనె తో తలకు మర్దన చేసుకోవడం ,వారానికి కనీసం రెండు సార్లు అయినా తల స్నానంచేయడం వలన తలలోని చుండ్రు దుమ్ము చెమటతో వచ్చిన మురికి పోయి జుట్టు శుభ్రం గా  ఉంటుంది. ఇలా చేయడం  వలన  జుట్టు రాలె సమస్య తగ్గించుకుని మంచి ఫలితం పొందవచ్చు.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri