పాలలో ప్రొటీన్లు, విటమిన్లు కాల్షియం, విటమిన్ బి 12, విటమిన్ డి,, పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని పాలుతాగడం చాలా మంచిదని కాల్షియం కావాల్సినంత అందుతుంది కాబట్టి పాలు ఎన్ని తాగిన పర్వాలేదనుకుంటారు. కాఫీ,టీ తాగమని ఎక్కడికి వెళ్లిన పాలు తాగేస్తూ ఉంటారు చాలామంది. అయితే.. అతిగా పాలు తాగడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు… అన్ని పోషకాలు ఉన్న పాలవల్ల కూడా ప్రమాదం ఉందంటున్నారు. ఆ ప్రమాదమేంటో చదివేయండి.
వాంతులు, వికారం లేదా కడుపు నొప్పిగా అనిపిస్తే ఎక్కువ పాలు తీసుకోవడం మానేయాలిసి ఉంటుంది.కొంతమందికి పాలు తాగడం వల్ల అలెర్జీలు, చర్మనికి సంబందించిన అలెర్జీలు వస్తాయి. పాలు అధికం గా తాగడం వల్ల ఎముకలకు జరిగే మేలు కన్నా , నష్టం ఎక్కువని కొందరు పరిశోధకులు చెపుతున్న మాట .
ప్రతి రోజూ రెండు గ్లాస్లకు మించి అంటే అర లీటర్ లేక అంతకు మించి పాలు తాగే వారికి పలు విధాలైన అనారోగ్య సమస్యలు ఏర్పాడి త్వరగా ప్రాణాలు కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజుకు 2 గ్లాసుల పాలు తాగే పురుషు ల్లో గుండె కి సంబందించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
స్త్రీ లల్లో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.పాలలో ఉండే క్లాక్ టోస్ ల్యాక్టోస్, అనే చక్కెర స్వభావం వలన పలు అనారోగ్య సమస్యలకు గురై , చివరికి ప్రాణాలనే పోగొట్టుకోవలిసి వస్తుందని తెలిపారు. కాబట్టి ఎక్కువ పాలు తాగే అలవాటు ఉంటె ., దాన్ని తగ్గించి, బదులుగా మజ్జిగ,పెరుగు, జున్ను, వెన్న వంటి పాల పదార్ధాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది .