Skin Care: కాలంతో సంబంధం లేకుండా
ఎండా కాలం,చలి కాలం లేదా వర్షాకాలం ఇలా కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు చర్మ సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. వాతావరణంలో ఉండే కాలుష్యం, వల్ల చర్మం తన సహజ కాంతిని కోల్పోయి.. జిడ్డుగా, నిర్జీవం గా తయారవడం తో పాటు ముఖం కాంతి విహీనంగా మారుతుంది. అలా జరగకూడదు అంటే మాత్రం స్కిన్ టోనర్ గా రోజ్ వాటర్ ని ఎంచుకోవడం అనేది చాలా బెస్ట్ ఛాయస్ అని చెప్పక తప్పదు. రోజంతా బయటి పనులతో ఉండే మనకు చర్మం వదలిపోయినట్టు అనిపిస్తుంది.
wintrer
Skin Care: కాంతివంతంగా తయారవడం
బయట ఉండే కాలుష్యం అంతా ముఖానికి పట్టేస్తుంది. ముఖం కడుక్కున్నాకూడా ఈ మురికి వదిలినట్టు అనిపించదు. అలాంటప్పుడు ఇంటికెళ్లాక ముఖాన్ని శుభ్రం చేసుకున్నా తర్వాత కాస్త రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే చర్మంపై ఉన్న వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారడం తో పాటు ముఖం చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. క్రమం తప్పకుండ రోజ్ వాటర్ ని వాడటం వల్ల ముఖం అందంగా, కాంతివంతంగా తయారవడం తో పాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు చేకూరతాయి. రోజ్ వాటర్ లో సంవృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా చేయడం లో గొప్పగా పనిచేస్తాయి.
వృధాప్య ఛాయలను
వృధాప్య ఛాయలను పోగొట్టడానికి రోజ్ వాటర్ హెల్ప్ అవుతుంది. ఎలాంటి చర్మానికైనా రోజ్ వాటర్ బాగా నప్పుతుంది. అందుకే రోజ్ వాటర్ ని బెస్ట్ స్కిన్ టోనర్ అని అంటారు. ఖరీదైన స్కిన్ టోనర్ ఎంపిక బదులుగా… రోజ్ వాటర్ ని తీసుకోవచ్చు. చర్మం మీది ఏర్పడిన మొటిమలు, నల్లమచ్చలు పొగొట్టడానికీ దైనా కాటన్ వస్త్రం తీసుకుని రోజ్ వాటర్ లో నానపెట్టి.. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నైట్ నిద్రకు ముందు ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేయడం అలవాటు చేసుకుంటే, ఇది చర్మ రంగును పెంచుతుంది. రోజ్ వాటర్ మేకప్ తొలగించడానికి కూడా బాగాఉపయోగపడుతుంది.