శృంగారం ద్వారా మానసిక ఆనందాన్ని పొందవచ్చని అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే శృంగారం ఎక్కువ చేస్తే అనేక మానసిక, శారీరక జబ్బులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసా…?
అవును శృంగార వాంఛ ఎక్కువైతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ విషయమైనా మితంగా ఉంటేనే బాగుంటుంది.. అదే మితి మీరితే కష్టాలపాలు అవ్వాల్సిందే. కొన్నిసార్లు శృంగారం ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. నిపుణులు తెలిపిన ప్రకారం ఎలాంటి సందర్భాలలో శృంగారం ద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉందో ఒకసారి చూద్దాం…
ముఖ్యంగా 50 సంవత్సరాల కంటే పైబడిన వ్యక్తులు శృంగారం ఎక్కువ చేయడం ద్వారా మృతి చెందే అవకాశంఉందని తెలుపుతున్నారు. అలాగే మద్యం సేవించిన తర్వాత శృంగారం లో పాల్గొనడం కాస్త ఇబ్బంది కలిగించే విషయం అని అది ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మద్యం సేవించిన తర్వాత వారికి కోరికలు ఎక్కువగా కలుగుతాయి. ఆ సమయంలో వారి ఆలోచనలు తప్ప ఇంకా ఏది తెలుసుకునే పరిస్థితుల్లో శరీరం ఉండదని తెలుపుతున్నారు.
అంతేకాకుండా ఒకే రోజులో ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా ప్రాణానికి హాని కలగవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఎక్కువ సార్లు శృంగారం చేయాలనే కోరిక ఉన్నప్పటికీ దానిని అదుపులో ఉంచుకోవాలని వారు తెలియజేస్తున్నారు. అయితే మితి మీరిన ఆవేశంతో శృంగారం చేయడం ద్వారా కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
దీని ద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు. ఆ తర్వాత డ్రగ్స్ తీసుకొని శృంగారంలో పాల్గొనడమే అతి ప్రమాదకరం అని ఒకవేళ శృంగారంలో అదుపుతప్పి ఎక్కువ మోతాదులో పాల్గొనడం వల్ల హార్ట్ ఎటాక్ కచ్చితంగా వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి శృంగారం లో ఎక్కువ పాల్గొంటే త్వరగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు