Mosambi Benefits: మహిళలు శిరోజాల సంరక్షణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. జడ అందంగా అలంకరించుకుని పూలు పెట్టుకుంటుంటారు. బారు జడ అమ్మాయిలను చూసి సహచర స్నేహితురాళ్లే ఈర్ష పడుతుంటారు. అయితే కొందరికి జుట్టు రాలిపోవడం, చుండ్రు తదితర సమస్యలత ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారు ఈ జ్యూస్ తాగితే మంచి ప్రయోజనం ఉంటుందట. పకృతిలో లభించే ఎన్నో రకాల పండ్లు, మొక్కల ద్వారా మన ఆరోగ్యానికి ప్రయోజనాలు బోలేడు ఉన్నాయి. సహజ సిద్ధంగ లభించే పండ్లలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మోసంబి జ్యూస్ తాగడం వల్ల అలసట, బలహీనత తొలగిపోవడమే కాక అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వైరల్ ఇన్పెక్షన్ నుండి రక్షిస్తాయి.
మోసంబిలో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక సౌందర్య సమస్యలను నివారిస్తాయి. ఇవి జుట్టు సమస్యలను, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు జుట్టు బలంగా చేస్తాయి. అలాగే చుండ్రు, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రెండు రోజులకు ఒక సారి ఈ జ్యూస్ తాగితే జుట్టు పెరుగుదల ఉంటుందట. మీరు ట్రై చేసి చూడండి.