Hair: జుట్టు ఏ ఆకారంలో ఉన్నా కానీ జుట్టు రాలకుండా మెయింటైన్ చేస్తూ ఉంటే చాలు అనుకునే రోజులు పోయాయి.. కురులు స్ట్రెయిట్ చేయడం అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్ గా మారిపోయింది. కర్లీ హెయిర్ ను స్ట్రెయిట్ చేస్తున్నారు.. కాగా ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఇంట్లోనే హెయిర్ స్ట్రెయిట్ చేసుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

నాచురల్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ కోసం కొబ్బరి పాలు, నిమ్మరసం బెస్ట్ చాయిస్. కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి తే అది చక్కని క్రీం లాగా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని జుట్టు మొదలు నుంచి చివరి అప్లై చేసి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఆ తరువాత దువ్వితే కురులు మృదువుగా మెరుస్తూ స్ట్రెయిట్ గా అవుతుంది. మొదటిసారి ఈ టిప్ ఫాలో అయినా కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.. ఒక్కసారికే హెయిర్ స్ట్రెయిట్ అవ్వడం మీరే గమనిస్తారు.
మరో చిట్కా కోసం.. రెండు చెంచాల చొప్పున కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్ సమాన మోతాదులో తీసుకోవాలి.. దీనిని బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా ఈ నూనె ఉన్నప్పుడు తలకు రాసుకొని పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను తరచుగా పాటిస్తూ ఉంటే జుట్టు స్ట్రెయిట్ అవ్వడం మీరే గమనిస్తారు.
మరొక రెమిడీ కోసం.. 5 స్ట్రాబెర్రీలను తీసుకొని అందులో తగినన్ని పాలు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. ఈ చిట్కా కూడా హెయిర్ స్ట్రెయిట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించుకోకుండా ఇలాంటి సహజ సిద్ధమైన పద్ధతులతో హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు..