Onion: ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు సంరక్షణకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. మీకు మీరుగా ఇంట్లోనే ఉండి ఉల్లి నూనె చేసుకోవచ్చు.. అదేంటో తెలుసుకుందాం..ఉల్లి చేసే మేలు చాలా రకాలు.. సాధారణంగా ఉల్లిపాయను ప్రతి కూరలలో చేర్చుకొని తింటాం.అయితే ఇప్పుడు పలు సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఉల్లిని ఉపయోగిస్తున్నారు.ముఖ్యంగా జుట్టు పెరుగుదల కోసం ఉల్లి షాంపూలు , ఉల్లి నూనెలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఉల్లిపాయ నూనె జుట్టు సంరక్షణ కోసం బహుళ ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు అంటున్నారు..

ఉల్లిపాయ నుండి సేకరించిన సహజ కణజాలాలలో విటమిన్లు ఏ, సి,ఈ లతోపాటు వివిధ బి-కాంప్లెక్స్ విటమిన్లు అలాగే సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ప్రయోజనకరమైన కణజాలు లభిస్తాయి. ఇవి జుట్టు తంతులకు పోషణ అందించే కెరాటిన్, ప్రోటీన్ వంటి పోషకాల ఉత్పత్తికి చాలా అవసరమైనవి.ఉల్లి నూనెలో క్వేర్సేటిన్ అనే శక్తివంతమైన ప్లేవనాయిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి జుట్టు దెబ్బ తినకుండా కాపాడడానికి ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.ఉల్లిపాయ నూనెను తలకు రాసుకుంటే జుట్టు పెరుగుదలకు మెరుగుపడడమే కాకుండా జుట్టు రాలడం చుండ్రు,స్కాల్స్,ఇన్ఫెక్షన్లు అరకడుతుంది.అంతేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు జీర్ణ సమస్యలు వివిధ చర్మ సమస్యలకు సహజ నివారణగా కూడా ఉపయోగపడుతుంది.
వీటికి నూనెను ఎక్కువ ఖర్చు చేసి కొనవలసిన అవసరం లేదు.మీకు మీరుగా మీ ఇంట్లోనే సొంతంగా ఉండి సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ముందుగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అనంతరం.. స్టవ్ ఆన్ చేసి.. దాని మీద ఒక పాన్ పెట్టి.. మీడియం వేడి మీద కొబ్బరి నూనె వేడి చేయండి. ఆ తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలను నూనెలో వేసి బాగా కలపాలి. తక్కువ వేడి మీద ఉల్లిపాయలు రంగు మారేంతవరకు వేడి చేయండి.ఆపై స్టౌ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ నూనె చల్లబడిన తర్వాత ఒక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవచ్చు.కొన్ని వారాలపాటు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు.